టేకులపల్లి మండలం బొమ్మన పల్లి వద్ద బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు లారీని ఓవర్‌టేక్ చేస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది.
టేకులపల్లి మండలం బొమ్మన పల్లి వద్ద బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు లారీని ఓవర్‌టేక్ చేస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో శశికుమార్(25), నరేష్(25)లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే 108 లో కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడ్డ యువకులు బూర్గంపాడు నియోజకవర్గ పరిధిలోని సారపాకకి చెందినవారిగా తెలుస్తోంది.