
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ దర్శకుడు కేజీ జార్జ్ (77) కన్నుమూశారు. పక్షవాతంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కేరళ కక్కనాడ్‌లోని వృద్ధాశ్రమంలో ఆయనకు ఇప్పటికే అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు సమాచారం.
(ఇది చదవండి: డ్రగ్స్ కేసులు..పబ్బు గొడవలు.. నిత్యం వివాదాల్లో హీరో నవదీప్!)
1976లో స్వప్నదానం సినిమాతో దర్శకుడిగా జార్జ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వ్యామోహం, యవనిక, ఇరకల్, మేళా, ఎలవంకోడు దేశం, మహానగరం, ఆడమింటే వారియెల్లు లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. డైరెక్టర్‌గా తన తొలి చిత్రం స్వప్నదానం సినిమాకు జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు.
2015లో మలయాళ సినిమాకు ఆయన చేసిన సేవలకు గాను కేరళ ప్రభుత్వం జైసీ డేనియల్ అవార్డుతో సత్కరించింది. అంతే కాకుండా కేజీ జార్జ్ కొత్త ఫిల్మ్ మేకింగ్ పాఠశాలను స్థాపించారు. మలయాళ సింగర్ సెల్మా జార్జ్‌ని 1977లో చెన్నైలో వివాహం చేసుకున్నారు. కాగా.. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
(ఇది చదవండి: బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి.. కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి చార్లీ!)