
రచయిత పీకే నందనవర్మ రాసిన అక్కర నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఆ తర్వాతి ఏడాది కనతయ పెంకుట్టి అనే మర్డర్ మిస్టరీ సినిమా తీశారు.ఇందులోనూ భరత్ గోపి..
కొచ్చి (కేరళ): మలయాళ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. డైరెక్టర్ కేఎన్ శశిధరణ్(72) జూలై 7న తుదిశ్వాస విడవగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేరళలోని కొచ్చి సమీపంలో ఈడపల్లిలోని తన నివాసంలో ఆయన మరణించారు. ఈరోజు(సోమవారం) సాయంత్రం దర్శకుడి అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం. కాగా శశిధరణ్ భార్య పేరు వీణ. వీరికి రీతూ, ముఖిల్ సంతానం.
కేఎన్ శశిధరణ్ పుణె ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు. 1984లో 'అక్కర' సినిమాతో మలయాళ ఇండస్ట్రీలో ప్రవేశించారు. ఈ సినిమాలో మమ్ముట్టి, నెడుముడి వేణు, రాణి పద్మిని, మోహన్‌లాల్, భరత్ గోపి, మాధవి, శ్రీనివాసన్, వీకే శ్రీరామన్ ప్రధాన పాత్రల్లో నటించారు. రచయిత పీకే నందనవర్మ రాసిన అక్కర నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఆ తర్వాతి ఏడాది 'కనతయ పెంకుట్టి' అనే మర్డర్ మిస్టరీ సినిమా తీశారు. ఇందులోనూ మరోసారి భరత్ గోపి, మమ్ముట్టి, వీకే శ్రీరామన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇకపోతే సినిమాల కంటే కూడా ఆయన ఎక్కువగా వాణిజ్య ప్రకటనలను డైరెక్ట్ చేసి గుర్తింపు సంపాదించుకున్నారు.
చదవండి: లక్కీ చాన్స్ చేజార్చుకున్న కీర్తి సురేశ్? ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!
షూటింగ్ సమయంలో దర్శకుడితో కాస్తా ఇబ్బంది పడ్డా