Naranipuzha Shanavas Brain Dead | Malayalam Director Naranipuzha Shanavas News In Telugu - Sakshi
Sakshi News home page

బ్రెయిన్‌ డెడ్‌: ఏదైనా మిరాకిల్‌ జరగాలి

Published Wed, Dec 23 2020 4:52 PM | Last Updated on Wed, Dec 23 2020 8:30 PM

Director Naranipuzha Shanavas Declared Brain Dead - Sakshi

కోయంబత్తూరు: సెట్స్‌లో షూటింగ్‌ జరుగుతున్న సమయంలో దర్శకుడు నారానీపుజ షాన‌వాస్‌ హఠాత్తుగా కుప్పకూలారు. దీంతో వెంటనే అతడిని కోయంబత్తూరులోని కేజీ ఆస్పత్రికి తరలించగా వైద్యులు బ్రెయిన్‌ డెడ్‌గా నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నట్లు బంధువులు తెలిపారు. కాగా షానవాస్‌ ప్రస్తుతం 'గంధీరాజన్'‌ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం ఆయన పాలక్కడ్‌లోని ఆటపదిలో వేసిన సెట్స్‌లో చిత్రీకరణ జరుపుతుండగా గుండెపోటుతో కుప్పకూలారు. దీంతో వెంటనే ఆయనను అత్యవసర చికిత్స కోసం కోయంబత్తూరులోని కేజీ ఆస్పత్రికి తరలించారు. అప్పటినుంచి అతడి పరిస్థితి విషమంగా ఉంది. నేడు ఉదయం అతడిని మరోసారి పరీశిలించిన డాక్టర్లు అతడికి బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు వెల్లడించారు. (చదవండి: సినీ పరిశ్రమలో విషాదం : క్రిస్మస్‌ స్టార్ కడుతూ)

ఆయన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ నిర్మాత విజయ్‌ బాబు ట్వీట్‌ చేశారు. షానవాస్‌ ప్రస్తుతం వెంటిలేటర్‌పైనే ఉన్నట్లు తెలిపారు. అతడి గుండె ఇంకా కొట్టుకుంటోందన్నారు. ఏదైనా మిరాకిల్‌ జరిగి ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తూ ట్వీట్‌ చేశారు. కాగా 2015లో 'కేరీ' సినిమాతో షానవాస్‌ దర్శకుడిగా పరిచయమయ్యారు. తర్వాత అదితి రావు హైదరీ, జయసూర్య, దేవ్‌ మోహన్‌ నటీనటులుగా 'సూఫియమ్‌ సుజాతయుమ్'‌ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా గతేడాది అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైంది. (చదవండి: మరీ అంత డర్టీ కాదు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement