Megastar Chiranjeevi's Bhola Shankar new schedule start - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో కోల్‌కతా! బోళా శంకర్‌ కొత్త షెడ్యూల్‌

Published Wed, Jan 18 2023 6:11 AM

Chiranjeevi Bhola Shankar new schedule start - Sakshi

హైదరాబాద్‌లో కోల్‌కతా ఏంటీ అనుకుంటున్నారా! చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బోళా శంకర్‌’ కోసం హైదరాబాద్‌లో కోల్‌కతా సెట్‌ వేశారు. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ కమర్షియల్స్‌తో కలిసి ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం ఇది. హైదరాబాద్‌లో తీర్చిదిద్దిన కోల్‌కతా సెట్‌లో ఈ చిత్రం కొత్త షెడ్యూల్‌ మంగళవారం ప్రారంభం అయింది.

ఈ సెట్‌లో చిత్రంలోని ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని టాక్‌. ‘‘మాసివ్‌ యాక్షన్  ఎంటర్‌టైనర్‌ ‘బోళా శంకర్‌’. చిరంజీవిని స్టైలిష్, మాస్‌ క్యారెక్టర్‌లో అద్భుతంగా చూపిస్తున్నారు మోహర్‌ రమేశ్‌. ఇందులో చిరంజీవి సోదరిగా కీర్తీ సురేష్, తమన్నా కథానాయికగా నటిస్తున్నారు’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిషోర్‌ గరికిపాటి, సంగీతం: మహతి స్వరసాగర్, కెమెరా: డడ్లీ.

Advertisement
 
Advertisement
 
Advertisement