![Chiranjeevi Is About To Start Shoot For Vedhalam Remake - Sakshi](/styles/webp/s3/article_images/2020/11/7/chiru.jpg.webp?itok=M3ogPWhN)
ఒకప్పుడు హీరోలు అతికష్టంగా ఏడాదికి ఒక సినిమా విడుదల చేసేవారు. తర్వాత వచ్చిన యంగ్ హీరోలు వారికి పోటీగా ఏడాదికి రెండు, కుదిరితే రెండు, మూడు సినిమాలు రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. వారిని చూసి సీనియర్ హీరోలు స్పీడ్ పెంచారు. ఖైదీ నం.150 సినిమాతో కమ్ బ్యాక్ ఇవ్వాలనుకున్నప్పుడే మెగాస్టార్ చిరంజీవి ఇప్పటినుంచి సంవత్సరానికి ఒక సినిమాతో మీ ముందుకు వస్తానని ఫ్యాన్స్‌కు మాటిచ్చారు. కానీ అలా జరగలేదు. 150వ సినిమా వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత సైరా వచ్చింది. ఆ సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడే కొరటాల శివతో తన తర్వాత చిత్రం ఉండబోతుందని ప్రకటించేశారు. అదే ఆచార్య..
కోవిడ్ వల్ల ఆ సినిమా షూటింగ్ కూడా ముందుకెళ్లలేకపోయింది. కానీ లాక్‌డౌన్ సమయంలో స్క్రిప్ట్‌లను వింటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టారు చిరంజీవి. ఇప్పుడు లాక్‌డౌన్ సడలించడంతో ఆచార్య షూటింగ్ 9 నుంచి ప్రారంభం కానుంది. కాజల్‌తో పాటు ఆయన కూడా అప్పటినుంచి ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ చిత్రం పూర్తవ్వగానే వెంటనే మరో సినిమా ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు మెగాస్టార్. (సీఎం కేసీఆర్‌తో చిరంజీవి, నాగార్జున భేటీ)
బిల్లా, శక్తి వంటి సినిమాలతో ప్రేక్షకులకు పరిచయమైన మెహర్ రమేశ్ దర్శకత్వంలో తమిళ సూపర్‌స్టార్ అజిత్ నటించిన వేదాళం సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఈ కథను తెలుగువారికి దగ్గరగా అనిపించేలా మార్పులు కూడా చేశాడు దర్శకుడు మెహర్ రమేశ్. తాజాగా అందిన సమాచారం ప్రకారం జనవరి 18న వేదాళం రీమేక్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు. దీనిపై మూవీ టీమ్ ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఈలోపు మెహర్ రమేశ్ పూర్తి స్క్రిప్ట్‌తో సిద్ధంగా ఉండాలని, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకోవాలని చిరంజీవి సూచించారు. (బాహుబలి తిరిగొచ్చాడు)
అనిల్ సుంకర, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ రీమేక్ ఒక పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ కనిపించబోతుందనే వార్త ప్రచారంలో ఉంది. ముందు ఆచార్య షూటింగ్‌తో, ఆ తర్వాత వేదాళం రీమేక్ షూటింగ్‌తో చిరంజీవి తీరిక లేకుండా గడపనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment