Mahesh Babu unveiled Megastar Chiranjeevi 154 movie Title is Bhola Shankar - Sakshi
Sakshi News home page

Happy Birthday Chiranjeevi: ‘భోళా శంకర్‌’గా అలరించనున్న చిరంజీవి

Published Sun, Aug 22 2021 9:10 AM | Last Updated on Sun, Aug 22 2021 9:39 AM

Mahesh Babu unveiled Megastar Chiranjeevi 154 movie Title is Bhola Shankar - Sakshi

మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఆగస్టు 22న మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ప్రకటించారు. త్వరలో పట్టాలెక్కనున్న ఈ చిత్రానికి ‘బోళా శంకర్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ఈ మూవీ టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.  ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.
(చదవండి: చిరంజీవికి మెగాస్టార్‌ బిరుదు ఎవరిచ్చారో తెలుసా?)

తమిళ్ బ్లాక్ బస్టర్ ‘వేదాళం రీమేక్ గా భోళా శంకర్‌ రూపొందబోతోంది. ఈ చిత్రం తమిళ వెర్షన్ లో అజిత్ హీరోగా నటించాడు. ఈ తెలుగు రీమేక్ లో ముందుగా పవన్ నటించాల్సి ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రీమేక్ ను నాన్చుతునే ఉన్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఈ రీమేక్ చేయబోతున్నారు. ఇందులో చిరు విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. ఆయన ఈ సినిమాలో గుండుతో కనిపించే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో చిరంజీవికి సోదరిగా కీర్తి సురేశ్‌ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement