Bhola Shankar Movie: Shooting Starts In November 15th - Sakshi
Sakshi News home page

Official: మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌, నవంబర్‌లో ‘భోళా శంకర్‌’ వస్తున్నాడు

Published Wed, Oct 27 2021 9:31 AM | Last Updated on Wed, Oct 27 2021 9:52 AM

Bhola Shankar Movie Shooting Starts In November 15th - Sakshi

మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రంగా ‘భోళా శంకర్‌’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తమిళ మూవీ ‘వేదాళం’ రీమేక్‌గా ఈ మూవీ రూపొందుతోంది. చిరు బర్త్‌డే(అగష్టు 22) రోజున ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడగా.. ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన కొత్త అప్‌డేట్‌ను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది చిత్ర బృందం.

నవంబర్‌ 11న ఈ మూవీని ప్రారంభం కానుందని, నవంబర్‌ 15 నుంచి రెగ్యూలర్‌ షూటింగ్‌ మొదలు పెట్టనున్నట్లు తాజాగా మేకర్స్‌ స్పష్టం చేశారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. తమిళ బ్లాక్ బస్టర్ ‘వేదాళం’ మూవీ రీమేక్‌గా భోళా శంకర్‌ రూపొందబోతోంది. ఈ చిత్రం తమిళ వెర్షన్‌లో అజిత్ హీరోగా నటించాడు. ఇందులో చిరు విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. ఆయన ఈ సినిమాలో గుండుతో కూడా కనిపించే అవకాశాలున్నట్లు సమాచారం. ఇందులో చిరుకు సోదరిగా కీర్తి సురేశ్‌ నటించనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement