
‘దేవర’ సినిమా కోసం ఎన్టీఆర్ యాక్షన్ మోడ్ కంటిన్యూ అవుతోంది. ‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ‘దేవర’. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైన లెంగ్తీ షూటింగ్ షెడ్యూల్ ముగిసింది.
ఎన్టీఆర్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలతో పాటు, ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించారు. పీటర్ హెయిన్స్ కొరియోగ్రఫీ చేసిన ఈ యాక్షన్ ఎపిసోడ్ సముద్రతీరం నేపథ్యంలో ఉంటుందని తెలిసింది. కాగా అతి త్వరలో మరో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట కొరటాల శివ.
సో.. దేవరగా ఎన్టీఆర్ యాక్షన్ మోడ్ మరికొన్ని రోజులు కంటిన్యూ అవుతుందనుకోవచ్చు. కాగా హీరో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ‘దేవర’ సినిమాలో ఒక పాత్రలో కనిపించనున్నారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. కల్యాణ్‌రామ్, కె.హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమా 2024 ఏప్రిల్ 5న విడుదల కానుంది.
ప్రత్యేక శిక్షణ.. బాలీవుడ్ స్పై థ్రిల్లర్ ‘వార్’కు సీక్వెల్‌గా ‘వార్ 2’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ , ఎన్టీఆర్ నటిస్తారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్న ‘వార్ 2’ లో తన పాత్ర కోసం ఎన్టీఆర్ స్పెషల్ గెటప్‌లో కనిపిస్తారట. ఇందుకు సంబంధించిన ఫిజికల్ ట్రాన్ఫర్మేషన్ కోసం ఎన్టీఆర్ ప్రత్యేకమైన శిక్షణ తీసుకోనున్నారని ఇండస్ట్రీ టాక్.
Comments
Please login to add a commentAdd a comment