‘ఆచార్య’ నుంచి తప్పుకోవడం లేదు | Kajal Aggarwal Is Part Of Chiranjeevi Acharya Telugu Movie | Sakshi
Sakshi News home page

‘ఆచార్య’ నుంచి తప్పుకోవడం లేదు

Published Sat, May 2 2020 8:08 PM | Last Updated on Sat, May 2 2020 8:08 PM

Kajal Aggarwal Is Part Of Chiranjeevi Acharya Telugu Movie - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి సందేశాత్మక చిత్రాల దర్శకుడు కొరాటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’.  రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ దాదాపు సగం వరకు పూర్తయింది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా షూటింగ్‌ వాయిదాపడింది. ఇక ఈ సినిమా గురించి అనేక వార్తలు సోషల్‌ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. తొలుత ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిషను తీసుకున్నారు. అయితే క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ కారణంగా అచార్య నుంచి త్రిష తప్పుకున్నారు. త్రిష స్థానంలో కాజల్‌ అగర్వాల్‌ను చిత్ర బృందం తీసుకున్నారు. అయితే గత కొద్దిరోజులుగా ఆచార్య నుంచి కాజల్‌ కూడా తప్పుకున్నట్లు రూమర్స్‌ వచ్చాయి. 

అయితే ఈ వార్తలను కాజల్‌ సన్నిహితులు కొట్టిపారేశారు. ఆచార్యలో చిరంజీవితో నటించేందుకు కాజల్‌ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని, ఈ సినిమా కోసం కాల్షీట్లు కూడా ఎక్కువనే కేటాయించారని చెబుతున్నారు. చిరంజీవి కమ్‌బ్యాక్‌ మూవీ ‘ఖైదీ నంబర్‌ 150’ (2017)లో కాజల్‌ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. మరోసారి ఈ జంట స్క్రీన్‌పై కనిపిస్తుండటంతో ‘ఆచార్య’ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆచార్యతో పాటు పవన్‌ సినిమాకు కూడా కాజల్‌ సైన్‌ చేసినట్లు టాక్‌. 

చదవండి:
సినిమాల్లోకి రీఎంట్రీ.. రేణు దేశాయ్‌ గ్రీన్‌సిగ్నల్‌
మళ్లీ ట్రెండింగ్‌లోకి ‘మున్నా’.. 13 ఏళ్లైంది కదా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement