
కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్ అగర్వాల్ కథానాయిక. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలానే ఓ కీలక పాత్రలోనూ యాక్ట్ చేయబోతున్నారు చరణ్. ఆయన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ జనవరిలో ప్రారంభం అవుతుందని తెలిసింది. కోవిడ్ బ్రేక్ తర్వాత ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే.
డిసెంబర్ నుంచి కాజల్ సెట్లో అడుగుపెట్టనున్నారు. చిరంజీవి లొకేషన్లోకి ఎప్పుడు ఎంటర్ అవుతారనేది తెలియాల్సి ఉంది. కాగా జనవరి మూడో వారంలో ‘ఆచార్య’ సెట్లోకి అడుగుపెడతారట రామ్‌చరణ్. ఒకే షెడ్యూల్‌లో ఆయన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ మొత్తాన్ని పూర్తి చేస్తారట. వచ్చే ఏడాది వేసవిలో ‘ఆచార్య’ను థియేటర్స్‌లోకి తీసుకురావాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడు.