Saana Kastam Lirical Song From Acharya movie Is Out: మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా నుంచి ‘సానా కష్టం వచ్చిందే మందాకినీ’అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ స్పెషల్ సాంగ్‌లో చిరంజీవితో కలిసి రెజీనా స్టెప్పులేసింది. భాస్కర్ భట్ల లిరిక్స్ అందించగా, రేవంత్, గీతా మాధురి ఈ పాటను ఆలపించారు.
'సానా కష్టం వచ్చిందే మందాకినీ... చూసేవాళ్ల కళ్లు కాకులు ఎత్తుకుపోనీ.. సానా కష్టం వచ్చిందే మందాకినీ.. నీ నడుము మడతలోన జనం నలిగేపోనీ..' అంటూ ఈ పాట సాగుతుంది. ఇప్పటికే ఈ సినిమాలోని లాహె లాహె, నీలాంబరి పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ చిత్రం ఫిబ్రవరి4న విడుదల కానుంది. కాగా ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ నటించగా, రామ్‌చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment