అమెరికా నుంచి రాగానే... | Megastar Chiranjeevi hits the Gym at 64 for Koratala Siva film | Sakshi
Sakshi News home page

అమెరికా నుంచి రాగానే...

Nov 9 2019 12:24 AM | Updated on Nov 9 2019 12:24 AM

Megastar Chiranjeevi hits the Gym at 64 for Koratala Siva film - Sakshi

చిరంజీవి

‘‘సైరా’ తర్వాత చేయబోయే సినిమాలో సన్నగా కనిపించడానికి కసరత్తులు మొదలుపెట్టారు చిరంజీవి’’... ఇదిగో ఇక్కడున్న ఫొటో చూసి చాలామంది అలానే అనుకుంటున్నారు. అయితే ఇప్పటికే ఎంతో బరువు తగ్గిన చిరంజీవి ఇప్పుడు ఎందుకు బరువు తగ్గాలనుకుంటారు? నిజానికి ఇప్పుడు చిరంజీవి అమెరికాలో ఉన్నారు. మరి.. ఈ ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌కి సంబంధించిన ఫొటో సంగతేంటి? అంటే ఇది పాత ఫొటో.

ఇక కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి చేయనున్న సినిమా విషయానికి వస్తే... ఇందులో కొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఫొటోషూట్‌ కూడా అయిపోయింది. ప్రస్తుతం వ్యక్తిగత పనుల మీద అమెరికా వెళ్లిన చిరంజీవి తిరిగి రాగానే డిసెంబర్‌ మొదటివారం నుంచి ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. పాట చిత్రీకరణతో సినిమా షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. రామ్‌చరణ్, నిరంజన్‌ రెడ్డి నిర్మించనున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement