
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిషను ఎంపిక చేశారు. అయితే పలు కారణాలతో ‘ఆచార్య’ నుంచి తప్పుకుంటున్నట్లు త్రిష అధికారికంగా ప్రకటించింది. దీంతో మరో కథానాయిక వేటలో పడ్డారు చిత్ర బృందం. ఈ క్రమంలో తొలుత అనుష్కతో ‘ఆచార్య’ బృందం చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. అనుష్కతో పాటు మరి కొంతమంది బామల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి.
సౌతిండియాలో ఆగ్రనటిగా వెలుగొందుతున్న నయనతార చిరు చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నప్పటికీ భారీ పారితోషకం అడగడంతో ఆమెను పక్కకు పెట్టారు. ఇక అన్ని ప్రయత్నాలు చేసిన కొరటాల శివ బృందం చివరికి కాజల్ అగర్వాల్‌ను ఫైనల్ చేశారట. ‘ఖైదీ నంబర్ 150’ లో చిరు-కాజల్‌ల కాంబినేషన్ కూడా ఫర్ఫెక్ట్ సెట్ అవడంతో మరోసారి ఇదో జోడిని రిపీట్ చేస్తే బాగుంటుందని ‘ఆచార్య’ బృందం బావించిందని విశ్వసనీయ సమాచారం. చిరు సరసన నటించే అవకాశం మరోసారి రావడంతో కాజల్ కూడా ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పెసిందని టాలీవుడ్ టాక్. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న రామ్‌చరణ్ సరసన నటించే మరో హీరోయిన్ కోసం కూడా చిత్రం బృందం వెతుకులాటా ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment