జూనియర్‌ ఎన్టీఆర్‌ సరసన ఛాన్స్‌ కొట్టేసిన బాలీవుడ్‌ బ్యూటీ? | JR NTR Pairup With Kiara Advani In Kotala Film | Sakshi
Sakshi News home page

జూనియర్‌ ఎన్టీఆర్‌ సరసన ఛాన్స్‌ కొట్టేసిన బాలీవుడ్‌ బ్యూటీ?

Published Wed, May 12 2021 7:49 PM | Last Updated on Wed, May 12 2021 10:27 PM

JR NTR  Pairup With Kiara Advani In Kotala Film - Sakshi

జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత ఆయన తదుపరి చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో ఉండనుంది. ఇప్పటికే ఈ మూవీపై పాజిటివ​ బజ్‌ క్రియేట్‌ అయ్యింది. జనతా గ్యారేజ్‌’(2016) తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఎన్టీఆర్, కొరటాల శివ  ఇప్పుడు కలిసి పని చేయనుండటంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి మొదలైంది. కొరటాల ప్రస్తుతం చిరంజీవి హీరోగా ‘ఆచార్య’  సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్‌తో ఓ భారీ బడ్జెట్‌ మూవీ చేయనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. అయితే ఇందులో ఎన్టీఆర్‌ సరసన ఎవరు నటించనున్నారనే సస్పెన్స్‌కు తెర పడినట్లు తెలుస్తోంది.

పాన్‌ ఇండియా స్థాయిలో ఈ మూవీని రూపొందించాలని భావిస్తున్నారట. దీంతో కియారా అద్వాని కానీ, రష్మికను కూడా కథానాయికగా తీసుకునే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే భరత్ అనే నేను మూవీతో కియారాకు కొరటాల పెద్ద హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి కియారాకే ఈ ప్రాజెక్టు ఇవ్వాలని భావిస్తున్నట్లు ఓ వార్త నెట్టింట వైరలవుతుంది. ఇక ఈ సినిమాలో తారక్‌ స్టూడెంట్‌ లీడర్గా కనిపించనున్నట్లు సమాచారం. స్టూడెంట్ పాలిటిక్స్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని,  పొలిటికల్‌ టచ్‌తో సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

చదవండి : ఇద్దరు కజిన్స్‌ను కోల్పోయా..నేనేమీ చేయలేకపోయా : నటి
ఎన్టీఆర్‌కు కరోనా.. హెల్త్‌ అప్‌డేట్స్‌ ఇచ్చిన చిరంజీవి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement