మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. చిరు సరసన కాజల్ నటిస్తోంది. మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. ఈ చిత్ర టైటిల్‌పై గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్నా ఇటీవలే ‘ఓ పిట్ట కథ’ సినిమా ఆడియో వేడుకలో చిరంజీవి అనుకోకుండా టైటిల్ ను రివీల్ చేసిన సంగతి తెలిసిందే. టైటిల్ మీద సస్పెన్స్ వీడిపోవడంతో ఇప్పుడంతా ఈ చిత్ర ఫస్ట్ లుక్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగాది సందర్భంగా ఫస్ట్‌లుక్ విడుదల చేస్తారని ఆశగా ఎదురు చూసిన ఫ్యాన్స్‌కు కొంత నిరాశ ఎదురైంది. చిరు సోషల్ మీడియా ఎంట్రీ ఆ లోటును భర్తీ చేసింది.
(చదవండి : కరోనాపై పోరాటం: చిరంజీవి, మహేశ్‌లు సైతం)
అయితే తాజాగా ఆచార్యకు సంబంధించిన ఓ వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 2న ఆచార్య నుంచి చిరంజీవి ఫస్ట్‌లుక్ విడుదల చేయాలని చిత్రం బృందం భావిస్తోందట. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన చిత్ర బృందం.. అక్కడి నుంచే ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం కోసం కృషి చేస్తున్నారని సమాచారం. అయితే ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. అన్ని కుదిరితే రాములోరి పండక్కి.. మెగా ఫ్యాన్స్‌కు పెద్ద అదిరిపోయే గిఫ్ట్ అందినట్లే.
మరోవైపు ఉగాది సందర్భంగా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. తొలి రోజు నుంచే కరోనావైరస్‌పై అవగాహన కల్పిస్తున్నారు. సినీ కార్మికులకు విరాళాలు అందజేసిన వారికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు సి. సి. సి. మనకోసం (కరోనా క్రై సిస్ చారిటీ మనకోసం) అనే సంస్థ ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు చిరంజీవి చైర్మన్‌గా ఉన్నారు. ఇప్పటికే పలువురు హీరోలు, నిర్మాతలు, దర్శకులు కరోనా క్రై సిస్ చారిటీకి పెద్దమొత్తంలో విరాళాలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment