
అల్లు అర్జున్
ఓ ప్లాన్ ప్రకారం కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నట్లున్నారు అల్లుఅర్జున్. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ అనే సినిమా కమిట్ అయ్యారు. ఈ చిత్రం తర్వాత కూడా మరో చిత్రానికి కమిట్‌మెంట్ ఇచ్చారట అల్లు అర్జున్. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? అంటే ప్రస్తుతం ఫిల్మ్‌నగర్‌లో కొరటాల శివ పేరు వినిపిస్తోంది. మరి.. అల్లు అర్జున్ – కొరటాల శివ కాంబినేషన్ కుదురుతుందా? వెయిట్ అండ్ సీ. ఈ సంగతి ఇలా ఉంచితే... ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’ సినిమాతో కొరటాల శివ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.