AA21 Update: Actress Varalaxmi Sarathkumar To Play A Role In Allu Arjun Movie - Sakshi
Sakshi News home page

స్టార్‌ హీరో సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్‌?!

Published Mon, Mar 1 2021 11:36 AM | Last Updated on Mon, Mar 1 2021 2:40 PM

Varalaxmi Sarathkumar To Be Part Of Allu Arjun Movie Social Media Buzz - Sakshi

రవితేజ ‘క్రాక్‌’ సినిమాలో ‘జయమ్మ’గా విమర్శల ప్రశంసలు అందుకున్నారు నటి వరలక్ష్మీ శరత్‌ కుమార్‌. ఇటీవల విడుదలైన అల్లరి నరేశ్‌ ‘నాంది’ మూవీలోనూ ‘ఆద్య’గా తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఈ అమ్మడు ప్రస్తుతం ఓ క్రేజీ టాలీవుడ్‌ ప్రాజెక్టులో నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కొరటాల గత సినిమాల మాదిరే #AA21ను కూడా సామాజిక సందేశంతో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇందులో బన్నీ తొలుత విద్యార్థి నాయకుడిగా, ఆ తర్వాత పొలిటికల్‌ లీడర్‌గా కనిపించనున్నారంటూ ఫిల్మీ దునియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

ఈ నేపథ్యంలో బన్నీ సినిమాలో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలక పాత్రలో కనిపించనున్నారంటూ సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. రాజకీయ నాయకురాలి పాత్రలో ఆమె నటించనున్నారంటూ ప్రచారం సాగుతోంది. కాగా గతంలో తెలుగులో సందీప్‌ కిషన్‌ ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’  సినిమాలో ఈ విలక్షణ నటి పొలిటికల్‌ లీడర్‌గా విలనిజం పండించిన సంగతి తెలిసిందే. అంతేగాక ఇళయదళపతి విజయ్‌ ‘సర్కారు’  మూవీలోనూ ఇదే తరహా నటన కనబరిచారు. ఈ నేపథ్యంలో బన్నీ సినిమాలోనూ ఆమె అదరగొట్టడం ఖాయం అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి నిజంగా వరలక్ష్మీ ఈ ప్రాజెక్టులో భాగం కానున్నారో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే!

చదవండి: ‘బేబమ్మ’.. చిన్నప్పటి యాడ్స్‌ చూశారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement