Pushpa Pre Release Event: Allu Arjun Speech Highlights Goes Viral - Sakshi
Sakshi News home page

Pushpa Pre Release Allu Arjun Speech: ఈ వేదికపై వారిని మిస్‌ అవుతున్న: బన్నీ

Published Mon, Dec 13 2021 9:17 AM | Last Updated on Mon, Dec 13 2021 1:32 PM

Allu Arjun Interesting Comment In Pushpa Movie Pre Release Event - Sakshi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌-క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో తాజాగా తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం స్మిగ్లింగ్‌ నేపథ్యంలో పాన్‌ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తొలి పార్ట్‌ను ‘పుష్ప ది రైజ్‌’ పేరుతో డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పుష్ప టీం ప్రమోషన్‌ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీంతో ఆదివారం పుష్ప ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ను జరుపుకుంది. ఈ ‍కార్యక్రమానికి దర్శకు ధీరుడు రాజమౌళి, కొరటాల శివ, నిర్మాత అల్లు అరవింద్‌ ముఖ్య అతిథిలుగా వచ్చారు. ఈ సందర్భంగా బన్నీ ఇండస్ట్రీకి దొరికిన గిఫ్ట్‌ అంటూ రాజమౌళి అల్లు అర్జున్‌పై ప్రశంసలు కురింపించాడు.  

అనంతరం అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. ‘‘సుకుమార్, దేవి, నేను ఒకేసారి జర్నీ స్టార్ట్‌ చేశాం. ఇప్పుడు ఈ వేదికపై వారిని మిస్‌ అవుతున్నాను. ఆర్‌ఆర్‌ఆర్‌ బాగా ఇచ్చేందుకు దేవి ఇక్కడికి రాలేకపోయాడు. ఈ ఒక్క సినిమా.. అన్ని విధాలుగా నాలుగు సినిమాల కష్టం లాంటిది. మైత్రీవారితో పాటు ఈ సినిమాలో ముత్తం శెట్టివారు నిర్మాణంలో భాగమయ్యారు. మా మావయ్య (రవి, విజయ్, కృష్ణ, రాజేంద్రప్రసాద్‌) లతో ముత్తంశెట్టి మీడియా బ్యానర్‌ పెట్టించి వారితో ఓ సినిమా చేయించాను. నేను పెరిగిన రోజుల్లో మా మావయ్యలు నాకెంతో ప్రేమను చూపించారు. ఇవాళ నా ప్రేమను చూపించుకునేందుకు ఓ అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. అయితే ‘పుష్ప’ మొదలైన తర్వాత రాజేంద్రప్రసాద్‌గారు చనిపోయారు. ఈ సినిమాను ఆయన కూడా చూసి ఉంటే బాగుండేది’’ అన్నారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఇక సుకుమార్‌ కూతురు సుకృతి మాట్లాడుతూ ‘‘నాన్న ఈ మధ్య అస్సలు ఇంటికి రావడంలేదు. ‘పుష్ప’ క్లిప్స్‌ చూశాను. బాగున్నాయి. ఈ చిత్రాన్ని సపోర్ట్‌ చేయండి’’ అని సుకుమార్‌ కుమార్తె  పేర్కొంది. ఈ కార్యక్రమంలో నటుడు సునీల్, కెమెరామ్యాన్‌ క్యూబా, దర్శకులు మారుతి, వెంకీ కుడుముల, బుచ్చిబాబు సన, అల్లు అర్జున్‌ కుమారుడు అయాన్, తనయ అర్హ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement