
సినిమాల విషయంలో కొన్ని కాంబినేషన్స్ విడుదలకు ముందే అంచనాలను పెంచుతుంది. అది హీరో-డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కావొచ్చు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా హీరో సినిమాను మార్కెట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాడు. కాగా కోలీవుడ్ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన పాటలు ఇప్పటికే యూట్యూబ్‌లో సన్సేషన్ సృష్టిస్తున్నాయి. ఇదిలా ఉండగా గతంలో ఈ మ్యూజిక్ డైరెక్టర్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిత్రం ‘అరవింద సమేత వీరా రాఘవ’ చిత్రానికి సంగీతం అందిస్తున్నట్లు మూవీ మేకింగ్ సమయంలో జోరుగా ప్రచారం సాగింది.
అయితే ఏం జరిగిందో తెలియదు కానీ చివరకు అనిరుధ్ స్థానంలో తమన్ మ్యూజిక్ అందించాడు. దీంతో ఎన్టీఆర్‌తో చేయాల్సిన సినిమాను అనిరుధ్ మిస్సయ్యాడు. అయితే ఈ సారి మాత్రం ఎన్టీఆర్‌తో అనిరుధ్ పనిచేయనున్నాడని టాలీవుడ్‌లో వినికిడి. కాగా కొరటాల శివ డైరెక్షన్‌లో ఎన్టీఆర్30 సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంగీత దర్శకుడిగా అనిరుధ్ వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. అంతేగాక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడన్నుట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment