
Jr NTR: బరువు పెరగడం... తగ్గడం... ఇలా పాత్ర ఎలా డిమాండ్ చేస్తే అలా మేకోవర్ కావడానికి రెడీ అయిపోతారు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్’లో చేస్తున్న కొమురం భీమ్ పాత్ర కోసం కాస్త బరువు పెరిగారు. తర్వాత చేయనున్న చిత్రం కోసం బరువు తగ్గనున్నారని సమాచారం. అయితే రెగ్యులర్‌గా కన్నా కూడా కాస్త సన్నబడాలనుకుంటున్నారట. కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సినిమా కోసమే ఈ మేకోవర్ అని భోగట్టా.
ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలోని పాట చిత్రీకరణ కోసం ఎన్టీఆర్ ఉక్రెయిన్ వెళ్లారు. ఆ పాటతో సినిమా పూర్తవుతుందట. దాంతో ఇండియా చేరుకున్న వెంటనే ప్రత్యేక డైట్, స్పెషల్ వర్కవుట్స్‌తో తగ్గే పని మీద ఉంటారని తెలిసింది. కొరటాల దర్శకత్వంలో చేసిన ‘జనతా గ్యారేజ్’లో ఎన్టీఆర్ స్టయిలిష్‌గా కనిపించారు. తాజా చిత్రంలోనూ అలా స్టయిలిష్‌గా కనిపించనున్నారని టాక్.
Comments
Please login to add a commentAdd a comment