NTR 30: Jr NTR And Koratala Siva Movie Shooting Start Soon - Sakshi
Sakshi News home page

ముహూర్తం ఫిక్స్‌? 

Published Mon, Feb 13 2023 1:49 AM | Last Updated on Mon, Feb 13 2023 8:50 AM

Jr NTR  and Koratala Shiva Movie Shooting Start Soon - Sakshi

‘జనతా గ్యారేజ్‌’ (2016) వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో మరో కొత్త సినిమా  తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ నటించనున్న ఈ 30వ చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌రామ్,  మిక్కిలినేని సుధాకర్‌ నిర్మించనున్నారు. కాగా ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం  కుదిరిందనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌లో వినిస్తోంది.

ఈ నెల 23న ఈ మూవీని గ్రాండ్‌గా లాంచ్‌  చేయనున్నారట ఎన్టీఆర్, కొరటాల శివ అండ్‌ కో. అలాగే మార్చి మూడోవారం నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌కి యూనిట్‌ ప్లాన్‌ చేస్తోందట. ఇందుకోసం హైదరాబాద్‌ శివార్లలో ఓ పోర్టు సెట్‌ను కూడా వేస్తున్నారని సమాచారం. ఈ చిత్రానికి అనిరుద్‌ సంగీతం అందిస్తున్నారు. ఇతర నటీనటులు,  టెక్నీషియన్స్‌ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారట కొరటాల శివ. అయితే ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తారనే ప్రచారం  జరుగుతోంది. ఈ మూవీని 2024 ఏప్రిల్‌ 5న విడుదల చేయనున్నట్లు ఎన్టీఆర్‌ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement