
NTR30: Jr Ntr And Koratala Siva Movie Update: రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్ల సమయాన్ని కేటాయించాడు తారక్. 2018లో అరవింద సమేతతో చివరిసారిగా థియేటర్‌లో సందడి చేసిన ఎన్టీఆర్ ఆ తర్వాత ఆర్‌ఆర్‌ఆర్ కారణంగా మరో సినిమా చేయలేదు. దీంతో గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేసేందుకు ఎన్టీఆర్ సిద్ధమయినట్లు తెలుస్తుంది.
అందులో భాగంగానే కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నారట. వచ్చే నెలలో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. ఆ దిశగా పనులు జరుగుతున్నట్లు తెలుస్తుంది. కెరీర్ పరంగా ఎన్టీఆర్‌కి ఇది 30వ సినిమా. ఈ సినిమా అనంతరం ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు తారక్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.