'దేవర' సినిమా నుంచి రీసెంట్‌గా రెండో సాంగ్ విడుదలైంది. అయితే, ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్- జాన్వీ కపూర్ కెమిస్ట్రీపై మంచి రెస్పాన్స్ వస్తుంది. కానీ, ఈ పాటని శ్రీలంక హిట్ సాంగ్ 'మనికే మనహేతే' అనే దానితో నెటిజన్లు పోలుస్తున్నారు. దీంతో నెట్టింట ట్రోల్స్ కూడా మొదలయ్యాయి. తాజాగా ఈ పాట ఒరిజినల్ కంపోజర్ అయిన చమత్ సంగీతే ఈ వివాదంపై స్పందించారు.
శ్రీలంకకు చెందిన మ్యూజిక్ కంపోజర్ చమత్ సంగీత్ 2021లో ‘మనికే మాగే హితే’ అనే సాంగ్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశారు. అప్పట్లో ఈ పాట పెద్ద సంచలనంగా మారిన విషయం తెలిసిందే. రికార్డ్ స్థాయిలో మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. అయితే, ఈ సాంగ్‌ను బేస్ చేసుకొని దేవర చిత్రంలో 'చుట్టమల్లే' పాటను మేకర్స్ క్రియేట్ చేశారని చర్చ జరుగుతుంది.
ఈ వివాదంపై చమత్ సంగీత్ స్పందించారు. సంగీత దర్శకులు అనిరుధ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన పాటలతో పాటు వర్క్‌ని కూడా అభిమానిస్తా. నా పాట ఆయనకు స్పూర్తి ఇచ్చిందంటే చాలా సంతోషంగా ఉంది. అని చమత్ పంచుకున్నారు. ఇప్పుడాయన కూడా పరోక్షంగా అచ్చూ తన పాట మాదిరే ఉందని చెప్పడంతో ఆ కామెంట్ కాస్త నెట్టింట వైరల్ అవుతుంది. అయితే, ఈ వివాదంపై అనిరుధ్, మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.
జూనియర్ ఎన్టీఆర్- జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ‘దేవర’ సినిమాను కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా.. ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment