
మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ క్రమంలో ఆచార్య విడుదల విషయం చర్చనీయాంశంగా మారింది. తొలుత దర్శకుడు ఆచార్యను డిసెంబర్ 24వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. అయితే రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం జనవరి 7వ తేదీకి రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ రెండు తేదీలకు పెద్దగా గ్యాప్ లేకపోవడంతో డిసెంబర్ 17న ‘ఆచార్య’ విడుదల చేయాలని కొరటాల నిర్ణయించారట.
చదవండి: ‘లవ్‌స్టోరీ’ చిత్రం చూసి భర్తపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన యాంకర్ సుమ
ఇదే తేదీకి చిరు కూడా ఒకే చెప్పినట్లు సమాచారం. అయితే అదే రోజున ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ కూడా రిలీజ్ కానుంది. దీనిపై ఇదివరకే మేకర్స్ అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. కానీ పుష్ప షూటింగ్‌ను ఇంకా పూర్తి చేసుకోలేదు. దీంతో ఆ తేదీలోగా షూటింగ్ పూర్తవుతుందా లేదా అనేది కూడా క్లారిటీ లేదు. మరీ ఆ తేదీలోగా ‘పుష్ప’ షూటింగ్‌ను పూర్తి చేసుకుంటుందా? లేదా ఆ డేట్‌ను ‘ఆచార్య’కు కెటాయిస్తారా? అనేది తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment