
బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ సౌత్‌లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అంటే అవుననే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఇప్పటికే ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలో రామ్‌చరణ్ సరసన నటించారు ఆలియా భట్. తాజాగా ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ సినిమా ప్రారంభోత్సవం అక్టోబరులో జరుగుతుందని, నవంబరు రెండో వారంలో రెగ్యులర్ షూటింగ్ ఆరంభం అవుతుందని సమాచారం. ఇందులో హీరోయిన్ పాత్రకు పూజా హెగ్డే, రష్మికా మందన్నా, కియారా అద్వానీల పేర్లు వినిపించాయి. తాజాగా ఆలియా పేరు తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్ సరసన చాన్స్ వస్తే తప్పక నటిస్తానని ఆలియా పలు సందర్భాల్లో చెప్పా రు. మరి.. ఆమె చెప్పినదే జరుగుతుందా?
Comments
Please login to add a commentAdd a comment