ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'దేవర'. సెప్టెంబర్ 27న విడుదల కానున్న ఈ సినిమాకు ప్రత్యేక షోలు వేసుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పకులు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
తెలంగాణలో టికెట్ ధరలు ఇలా
దేవర సినిమాకు అదనపు షోలు ప్రదర్శించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 27న అర్ధరాత్రి 1గంట షో కోసం 29 థియేటర్స్‌కు అవకాశం ఇస్తున్నట్లు తాజాగా జీఓ విడుదల చేసింది. అయితే, టికెట్ ధర విషయంలో రూ. 100 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అదే రోజు ఉదయం 4 గంటల ఆటతో పాటు మొత్తం 6 షోల వరకు గ్రీన్ సిగ్నల్ లభించింది. సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ అన్నీ థియేటర్స్ కూడా ఆ ఒక్కరోజు టికెట్ ధర రూ. 100 పెంచుకునేందుకు అవకాశం ఉంది.
అయితే, సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 6 వరకు మాత్రం రోజుకు 5 షోల వరకు మాత్రమే అనుమతి ఉంది. ఈ తొమ్మిది రోజులకు టికెట్ ధరల్లో మార్పులు ఉన్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అయితే టికెట్‌పై రూ. 25, మల్టీఫ్లెక్స్ అయితే రూ. 50 మాత్రమే పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. దేవర విడుదల రోజు సింగిల్ స్క్రీన్‌లో టికెట్ ధర రూ. 295 ఉంటే మల్టీఫ్లెక్స్‌లో మాత్రం రూ. 413 ఉంటుంది.
ఏపీలో టికెట్ ధరలు ఇలా
'దేవర' విడుదల రోజు అర్ధరాత్రి 12 గంటల షోతో పాటు ఆరు ఆటలకు ఏపీ అనుమతిచ్చింది. ఆ తర్వాత రోజు 5 షోలు ప్రదర్శించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఇలా 9రోజుల వరకు అదనపు షోలు ఉండనున్నాయి. ఇదే క్రమంలో దేవర టికెట్ల ధరలను సైతం పెంచుకునే అవకాశం ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ మొదటి తరగతి టికెట్స్‌కు రూ. 110, దిగువ తరగతి రూ.60 వరకు పెంచింది. మల్టీప్లెక్స్‌లలో అయితే రూ. 135 చొప్పున పెంచింది. జీఎస్టీతో కలుపుకొనే ఈ ధరలు ఉండనున్నాయి. అంటే ఈ లెక్కన సింగిల్ స్క్రీన్‌లో దేవర టికెట్ ధర రూ. 225 ఉంటే మల్టీప్లెక్స్‌లలో మాత్రం రూ.320 ఉండనుంది. ఈ పెరిగిన ధరలు సెప్టెంబర్ 27 నుంచి 14 రోజుల పాటు ఉండనున్నాయి.
#Devara Nizam 1 AM Shows permitted screens. Total 29 properties 👌👍 pic.twitter.com/gFGaXqDtbP
— Vinay Gudapati (@gudapativinay) September 23, 2024
Comments
Please login to add a commentAdd a comment