
కొరటాల శివ దర్వకత్వంలో తెరకెక్కనున్న మూవీలో మెగాస్టార్ ప్రభుత్వ అధికారిగా అలరించనున్నారు.
హైదరాబాద్ : సైరా మూవీతో గ్రాండ్ పీరియాడికల్ మూవీలో నటించాలన్న కోరిక నెరవేర్చుకున్న మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో సామాజిక సందేశం అందించే విలక్షణ పాత్రను రక్తికట్టించనున్నారు. రాంచరణ్ ప్రొడ్యూస్ చేస్తూ చిరంజీవి 152వ సినిమాగా తెరకెక్కుతున్న మూవీలో ఆయన దేవాదాయ శాఖలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగి క్యారెక్టర్‌లో కనిపించనున్నట్టు సమాచారం. ఈ సినిమా కోసం తీరైన ఆకృతితో అభిమానులను అలరించేందుకు మెగాస్టార్ రెగ్యులర్‌గా జిమ్‌లో చెమటోడుస్తున్నారు. ఈ మూవీతో చిరు సరసన ఆడిపాడేందుకు భారీ విరామం తర్వాత చెన్నై భామ త్రిష తెలుగులో రీఎంట్రీ ఇవ్వనున్నారు. జనవరి మాసాంతంలో లేదా ఫిబ్రవరి తొలివారంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ మూవీకి మణిశర్మ స్వరాలు సమకూర్చనున్నట్టు తెలిసింది.