Bigg Boss 8: సోనియా వల్ల నిఖిల్‌కి చెడ్డపేరు.. మొత్తం సీన్ ఛేంజ్ | Bigg Boss 8 Telugu Day 24 Latest Promo Video: Chief Selection Between Contestants In BB House, Watch Promo Inside | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Telugu Day 24 Promo: నిజాలు బయటపడ్డాయ్.. సీతకే సపోర్ట్ ఎక్కువ

Sep 25 2024 9:56 AM | Updated on Sep 25 2024 10:27 AM

Bigg Boss 8 Telugu Day 24 Promo Nikhil And Sonia

బిగ్‌బాస్ 8లో ఎ‍ప్పుడేం జరుగుతుందో అస్సలు చెప్పలేం. ఎందుకంటే ఈరోజు వరకు స్ట్రాంగ్ అనుకున్న కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోవచ్చు. ఓ వైపు ఉన్నోళ్లంతా మరోవైపు జంప్ అయిపోవచ్చు. ఇప్పుడు సేమ్ ఇలాంటి పరిస్థితే నిఖిల్‌కి ఎదురైంది. సోనియా వల్ల అతడికి చెడ్డపేరు రావడంతో పాటు నెగిటివిటీ కూడా మరింత ఎక్కువైపోతోంది. తాజా ప్రోమోలో ఇదే స్పష్టమైంది.

(ఇదీ చదవండి: Bigg Boss 8: సోనియా బండారం బయటపెట్టిన యష్మి.. నిఖిల్-సోనియా మధ్య మనస్పర్థలు)

బిగ్‌బాస్ 8లో ప్రస్తుతమున్న వాళ్లలో నిఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్. శక్తి క్లాన్‌కి ఇతడు చీఫ్‌గానూ ఉన్నాడు. అలానే పెట్టిన ప్రతి గేమ్‌లోనూ  పోటీ పడుతూ బెస్ట్ ఇస్తున్నాడు. ఇతడి కూడా ఉంటున్న సోనియా మాత్రం ఆడటం సంగతి పక్కనబెడితే అందరి మధ్య పుల్లలు పెడుతోంది. ఈమె చేస్తున్న పనివల్ల నిఖిల్‌కి చెడ్డ పేరు వస్తోంది. ఈ వారం నామినేషన్స్‌లోనూ యష్మి-నిఖిల్ బంధం గురించి సోనియా మాట్లాడిన తీరు చాలా వరస్ట్. ఇదంతా అప్పుడు ఎవరూ చెప్పనప్పటికీ ఇప్పుడు బయటపెట్టారు.

తాజాగా క్లాన్ కోసం జరిగిన పోటీల్లో గెలిచిన సీత.. కొత్త చీఫ్‌గా ఎంపికైంది. హౌస్‌లోని ఉన్నవాళ్లు ఎవరు ఏ క్లాన్ లో ఉండాలనేది నిర్ణయించుకోవాలని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో ఎప్పటిలానే నిఖిల్ చీఫ్‌గా ఉన్న శక్తి క్లాన్‌లోకి సోనియా, పృథ్వీ వెళ్లగా.. మిగిలిన వాళ్లందరూ సీత చీఫ్‌గా ఉన్న 'కాంతార' క్లాన్‌లోకి వెళ్లినట్లు చూపించారు. దీనిబట్టి చూస్తే సోనియా చీప్ బిహేవియర్ ఆమెకు మాత్రమే కాదు నిఖిల్‌కి కూడా మరింత చెడ్డ పేరు తీసుకొచ్చేలా ఉంది.

(ఇదీ చదవండి: యూట్యూబర్ హర్షసాయిపై కేసు.. నిజాలు బయటపెట్టిన యువతి)

Advertisement
 
Advertisement
Advertisement