నేను నీతులు చెప్తాను, కానీ పాటించను.. సోనియా ప్రవర్తన చూస్తున్న చాలామందికి ఈ డైలాగ్ గుర్తురాక మానదు. ఎవరు ఏం మాట్లాడినా అందులో తప్పులు, పెడార్థాలు తీయడమే పనిగా పెట్టుకుంది. పైగా హౌస్‌లోకి వచ్చిన కొత్తలో నిఖిల్ గురించి చెడుగా మాట్లాడి ఇప్పుడు అతడితోనే క్లోజ్‌గా ఉంటోంది.
అంతేనా లైవ్‌లో విష్ణుప్రియ, యష్మి గురించి నిఖిల్‌కు నెగెటివిటీ ఎక్కిస్తోంది. మరోవైపు అతడి జుట్టుతో ఆడుకుంటూ.. మనం ఒక టీమ్ అంటూ.. జంట కలిపేసింది. ఇంకా తనతో సిగరెట్ అలవాటు కూడా మాన్పించే ప్రయత్నం చేసింది. సిగరెట్ తాగకుండా ఉంటే నువ్వేమడిగినా ఇస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చింది. మరోవైపుథ్వీ చేతిలో చెయ్యేసి మాట్లాడింది. ఇవన్నీ చూసిన జనాలు.. ఈమె ఇంకో రతిక అయ్యేలా ఉందని కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment