
సోనియా ఆకుల.. బిగ్‌బాస్ ప్రారంభమైన మొదట్లో తనలోని ఫైర్ చూసి ఇలాంటి కంటెస్టెంట్ కదా కావాల్సింది అని అంతా అనుకున్నారు. నిర్భయంగా, నిర్మొహమాటంగా మాట్లాడే తన వైఖరికి అందరూ ఫిదా అయ్యారు. కానీ అంతలోనే ఆమె గాడి తప్పింది. నిఖిల్, పృథ్వీల దోస్తాన్‌తో ఎక్కువ నెగెటివిటీ మూటగట్టుకుంటోంది. మితిమీరిన హగ్గుల వల్ల సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతోంది. ఈ ట్రోలింగ్‌పై సోనియా పేరెంట్స్ మల్లీశ్వరి- చక్రపాణి ఆవేదన వ్యక్తం చేశారు.

ఉన్న పేరు కూడా పోతుందేమోనని..
ఈ మేరకు తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మా అమ్మాయి బాగా ఆడుతోంది. అయినా తననే టార్గెట్ చేస్తున్నారు. ఎందుకలా బద్నాం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఒక పల్లెటూరి నుంచి వచ్చిన అమ్మాయి స్వచ్ఛంద సంస్థ స్థాపించి ఎంతోమందికి సాయం చేసింది. తను సంపాదించుకున్న పేరుతో సినిమా అవకాశాలు వచ్చాయి. అలా బిగ్‌బాస్ ఆఫర్ అందుకుంది. కానీ ఈ ట్రోలింగ్ చూస్తుంటే.. తను సంపాదించిన మంచి పేరు పోతుందేమోనని బాధగా ఉంది.

అందుకే ఆ ఇద్దరితో అంత చనువు
ఆమె నిఖిల్, పృథ్వీని పెద్దోడు, చిన్నోడు అని పిలిచింది. అంటే ఇద్దరినీ పెద్దన్నయ్య, చిన్నన్నయ్యలా ఫీలైంది. అందుకే వారితో అంత చనువుగా ఉంటోంది. దాన్ని కూడా వక్రీకరిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. తను బిగ్‌బాస్ కప్పు గెలుస్తుందన్న నమ్మకముంది. ఆడవారికి ఆడవారే శత్రువు అన్నట్లు హౌస్‌లో ఉన్న మిగతా అమ్మాయిలు కూడా నా కూతురి గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు. అలాంటప్పుడు కనీసం నిఖిల్, పృథ్వీ అయినా అన్నలా తోడున్నందుకు సంతోషంగా ఉంది. తన ఆటతో మున్ముందు అందరి నోళ్లు మూయిస్తుంది.

సోనియా పెళ్లి ఫిక్స్
సోనియాకు లవ్ ఎఫైర్స్ లేవు. ఆల్‌రెడీ పెళ్లి ఫిక్సయిపోయింది. డిసెంబర్‌లోనే వివాహం.. తనకు కాబోయే అత్తామామల అంగీకారంతోనే బిగ్‌బాస్ షోకి వెళ్లింది. త్వరలో పెళ్లి చేసుకునే అమ్మాయిని ఇంత బద్నాం చేయొద్దు. తను ఐదుగురు అనాథ చిన్నారులను చదివిస్తోంది. ఇంకా 50 మంది అనాథలను చదివించాలన్నదే ఆమె ధ్యేయం. వారికోసమే తను తపిస్తోంది. అది అర్థం చేసుకోండి అని వేడుకున్నారు.

Comments
Please login to add a commentAdd a comment