బిగ్‌బాస్ షో వల్ల కంటెస్టెంట్ల కెరీర్ ముందుకెళ్తుందో, లేదో కానీ జనాల్లో పబ్లిసిటీ మాత్రం పుష్కలంగా దొరుకుతుంది. అయితే పాజిటివ్ కంటే నెగెటివ్ పబ్లిసిటీ మూటగట్టుకున్నవారే ఎక్కువ. ఆ జాబితాలోకి సోనియా ఆకుల వస్తుంది.
దూకుడుకు చెక్
మంథనికి చెందిన ఈ బ్యూటీ బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్‌లో పాల్గొంది. హౌస్‌లో అందరికంటే స్ట్రాంగ్ అనుకున్న నిఖిల్‌తో మొదట తలపడింది. కానీ కొద్దిరోజుల్లోనే అతడిని గుప్పిట్లో పెట్టుకుంది. అయితే అతడితో ప్రవర్తించిన తీరు కూడా జనాలకు ఏమాత్రం నచ్చలేదు. దాంతో ఆమెను త్వరగానే ఎలిమినేట్ చేశారు.
పెళ్లికి రెడీ
ఇకపోతే సోనియా ఆకుల పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్ధమైంది. ప్రియుడు యష్‌తో ఏడడుగులు వేసేందుకు ఆత్రంగా ఎదురుచూస్తోంది. గత నెలలో వీరిద్దరి నిశ్చితార్థం జరగ్గా ఇటీవలే పెళ్లిపత్రికలు కూడా అచ్చు వేయించారు. డిసెంబర్ 21న మధ్యాహ్నం 3.40 గంటలకు తమ వివాహం జరగనుందని తెలియజేస్తూ సోనియా సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేసింది. అయితే రిసెప్షన్ మాత్రం పెళ్లికి ఒకరోజు ముందే ప్లాన్ చేసినట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment