ఈసారి నామినేషన్స్ ప్రక్రియను బిగ్‌బాస్ వెరైటీగా ప్లాన్ చేశాడు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను హౌస్‌లోకి రప్పించి.. ఇద్దర్ని నామినేట్ చేయాలన్నాడు. అలా మొదటగా సోనియా ఆకుల హౌస్‌లో ఎంట్రీ ఇచ్చింది. వచ్చీరావడంతోనే నిఖిల్ బ్యాచులో పుల్లలు పెట్టింది. పృథ్వీని ఇంట్లో నుంచి పంపించేయాలనుకున్నావ్ అంటూ ప్రేరణను నామినేట్ చేసింది.
సిల్లీ రీజన్స్‌తో నామినేషన్
ఇక నిఖిల్‌ను అయితే ఓ ఆటాడేసుకుంది. మొదట్లో పృథ్వీని ఎందుకు నామినేట్ చేశావ్? అని అడిగింది. అందుకతడు నిర్లక్ష్యంగా ఉన్నందుకు చేశానన్నాడు. అది విని అవాక్కైన పృథ్వీ.. ఆ కారణంతో నామినేట్ చేశావా? అని నోరెళ్లబెట్టాడు. మంచి పాయింట్లతో ఎప్పుడైనా నామినేట్ చేశావా? అని నిఖిల్‌ను నిలదీసింది. ఇక యష్మితో లవ్ ట్రాక్ గురించి మాట్లాడుతూ.. యష్మి తన మనసులో ఫీలింగ్ చెప్పింది.. కానీ నువ్వు అంటూ సోనియా మాట్లాడుతుండగా.. మధ్యలో నిఖిల్ అందుకున్నాడు.
నిఖిల్ జోలికే వెళ్లేదాన్ని కాదు
తన ఫీలింగ్ చెప్పగానే అక్కడే కట్ చేసేశాను అని క్లారిటీ ఇచ్చాడు. అది అబద్ధమని యష్మి గట్టిగా అరిచింది. క్లారిటీగా తనకు చెప్పుంటే నిఖిల్ జోలికే వెళ్లేదాన్ని కాదంది. అతడి వల్ల తాను బ్యాడ్ అయ్యానంది. అలా సోనియా నిఖిల్ నెత్తిపై బాటిల్ పగలగొట్టి నామినేట్ చేసింది. మరి హౌస్‌లోకి ఇంకా ఎవరెవరు వచ్చారు? ఎవర్ని నామినేట్ చేశారు? అనేది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment