
కోడిగుడ్డు టాస్క్‌లో కంటెస్టెంట్లు కొట్టుకున్నంత పని చేశారు. దీంతో ఈ రోజు బిగ్‌బాస్ ఈ గేమ్‌కు స్వస్తి పలకనున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో నిఖిల్.. సోనియాను తిన్నావా? అని అడిగాడు. అందుకామె ఆకలేసినప్పుడు తింటానని బదులిచ్చింది. తను అలిగిందన్న విషయం అర్థమైన నిఖిల్.. గొడవ తర్వాత పెట్టుకుందాం కానీ ముందు తిను అని గోముగా బతిమాలాడు. అందుకు సోనియా.. నీకంత ఉంటే నువ్వు తినేటప్పుడే అడగాల్సింది అని కొట్టినట్లు సమాధానమిచ్చింది.

సుద్దపూస
తన మాటలతో హర్ట్ అయిన నిఖిల్.. నేను తనకు ఎలా కనిపిస్తున్నాను? నేను పర్సనల్ లైఫ్‌లో ఎలా ఉన్నాననేది అందరి ముందు జడ్జ్ చేస్తుంటే నాకు కోపం రాదా? అని అభయ్ దగ్గర గోడు చెప్పుకున్నాడు. అటు సోనియా కూడా కాసేపయ్యాక అదే అభయ్ దగ్గరకు వెళ్లి.. అందరూ తిన్నతర్వాత ఈ సుద్దపూస నిల్చుని తింటాడు. వీడు ఇప్పుడొచ్చి తినలేదా? అని అడుగుతున్నాడు అని నిఖిల్‌పై సెటైర్లు వేసింది.

గుడ్డు కోసం ప్లేటు తిప్పిన సోనియా
ఇంతలో బిగ్‌బాస్ ఎర్రగుడ్డు ఎవరి దగ్గరుందని అడిగాడు. ఆ గుడ్డు ఎవరి దగ్గర ఉంటే వారు క్లాన్ చీఫ్ అయ్యే అవకాశాన్ని పొందుతారని చెప్పాడు. ఆ గుడ్డు నిఖిల్ దగ్గరే ఉంది. దాన్ని భద్రంగా దాచమని చెప్పిన సీత.. కుతూహలంగా ఆ ఎగ్ ఎవరికి ఇస్తున్నావని అడిగింది. ఇంతలో సోనియా.. తన గొడవకు ఫుల్‌స్టాప్ పెడుతూ నిఖిల్‌కు సారీ చెప్పింది. ఇంకేముంది, మంచులా కరిగిపోయిన నిఖిల్.. ఆ గుడ్డును సోనియాకు ఇచ్చేశాడు.

సీత కన్నీళ్లు
ఎర్రగుడ్డుతో ప్రయోజనాలు ఉంటాయని చెప్పిన తనను నిఖిల్ పక్కనపెట్టేయడంతో సీత కన్నీళ్లు పెట్టుకుంది. నిఖిల్ మాట్లాడేందుకు వస్తే కూడా వెళ్లిపో అని అరిచేసింది. ఈ ప్రోమో చూసిన జనాలు నిఖిల్ సోనియా జపం చేస్తున్నాడు. ముందు పోట్లాడిన ఈమె ఎగ్ కోసం వెంటనే వెళ్లి సారీ చెప్పింది. తన గుంటనక్క స్వభావాన్ని నిఖిల్ అర్థం చేసుకోలేకపోతున్నడు అని కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment