
బిగ్ బాస్ 8 నుంచి సోనియా ఎలిమినేట్ అయిపోయింది. సోషల్ మీడియాలో చాలామంది పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే షో మొదలైన కొత్తలో సోనియా.. మిగిలిన వాళ్లతో పోలిస్తే స్ట్రాంగ్ కంటెస్టెంట్‌లా కనిపించింది. లా పాయింట్స్ చెబుతూ అవతలి వాళ్లని ఇరకాటంలో పెట్టింది.
ఎప్పుడైతే నిఖిల్ పక్కన చేరిందో అప్పటి నుంచి సోనియా గేమ్ పక్కకు వెళ్లిపోయింది. యష్మి, మిగిలిన వాళ్లతో ప్రతిదానికి వాదిస్తూ పోయింది తప్పితే టాస్కులు కూడా ఆడాలి అనే సంగతి మర్చిపోయింది. అలానే హౌసులో ఉన్న అమ్మాయిలందరూ చాలా జాగ్రత్తగా గేమ్స్ ఆడుతూ స్ట్రాంగ్ అవుతూ వచ్చారు. ఈమె మాత్రం ఎప్పుడు చూడు పృథ్వీ-నిఖిల్‌తో కలిసి ముచ్చట్లు పెడుతూ వచ్చింది. అలా మిగిలిన వాళ్లందరికీ టార్గెట్ అయిపోయింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్)

విష్ణుప్రియ ఫ్యాన్స్ కూడా ఈసారి సోనియాని టార్గెట్ చేశారు. దీంతో ఓటింగ్‌లో చివరి స్థానంలో నిలిచింది. ఇదే విషయాన్ని ఆదివారం ఎపిసోడ్‌లో నాగార్జున కూడా బయటపెట్టాడు. లెక్క ప్రకారం చూసుకుంటే నిఖిల్ ఫ్యాన్స్ అందరూ తనకు ఓట్లు వేస్తారని సోనియా అనుకుంది. కానీ అలా జరగలేదు.
సోనియాని ఎలిమినేట్ చేసి బిగ్‌బాస్ మంచి పని చేశాడని సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఈమె వెళ్లిపోయింది కాబట్టి నిఖిల్ గేమ్ ఇకపై కరెక్ట్‌గా ఉంటుందనిపిస్తోంది. ఇదలా ఉంచితే వచ్చే వారం దాదాపు ఆరు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండనుంది.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8లో మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఈసారి ఎవరిపై వేటు?)
Their Bond 💔
The way he said miss u machan in tears 🥺 ❤️
Stay Strong Nikhil 💪#SoniyaAkula #NikhilMaliyakkal #Soniya #BiggBoss #BiggBossTelugu #BiggBossTelugu8 pic.twitter.com/OzPWuSSonx— GeethaRyder (@GeethaRyder) September 29, 2024