బిగ్‌ బాస్‌,అదిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసిన సోనియా | Bigg Boss 8 Telugu Sonia Akula Comments On Adireddy Reviews In Youtube, Video Trending On Social Media | Sakshi
Sakshi News home page

బిగ్‌ బాస్‌,అదిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసిన సోనియా

Published Fri, Oct 11 2024 5:09 PM | Last Updated on Fri, Oct 11 2024 5:51 PM

Bigg Boss Sonia Akula Comments On Adireddy Review

బిగ్‌బాస్‌ తెలుగు ఎనిమిదో సీజన్‌లో  సోనియా ఆకుల పేరు సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అయింది. అయితే, బిగ్‌ బాస్‌లో పాల్గొన్న ఒక అమ్మాయిపై ఈ రేంజ్‌లో నెగెటెవిటీ, ట్రోలింగ్‌ జరగడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. ఇదంతా ఆమె మాటల వల్లే ఇబ్బందులు ఎదురయ్యాయని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చిన సోనియా  ఇప్పటికే పలు ఇంటర్వ్యూలు ఇస్తూ ఇక్కడ కూడా వైరల్‌ అవుతుంది.

షో నుంచి ఎలిమినేషన్‌ అయిన తర్వాత ఆమె ఇప్పటికే బిగ్‌ బాస్‌ మీద కూడా పలు ఆరోపణలు చేసింది. తన  మాటల్ని ఇష్టమొచ్చినట్లుగా కట్‌ చేసి చూపించడమే కాకుండా.. తనను చాలా క్లోజప్‌ యాంగిల్స్‌లో ప్రేక్షకులకు చూపించారని తెలిపింది. బిగ్‌ బాస్‌ ఫేమ్‌ ఆదిరెడ్డి మీద కేసు పెట్టినట్లు ఇంటర్వ్యూ ద్వారా సోనియా తెలిపింది. రివ్యూల పేరుతో తనను కించపరిచేలా చాలా ఎక్కువగా చేసినట్లు ఆదిరెడ్డిపై ఆమె ఫైర్‌ అయింది. అయితే, ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోనవసరం లేదని తన కుటుంబ సభ్యులు చెప్పడంతో కేసు విషయంలో కాస్త తగ్గానని ఆమె తెలిపింది.

'నా వల్ల నెలరోజుల పాటు రివ్యూవర్లు బాగా బతికారు.. నా గురించి వీడియోలు చేసుకుంటూ చాలామంది పంపాదించుకున్నారు. బిగ్‌ బాస్‌ షో కూడా ఈ 30 రోజులు నా వల్లే రేటింగ్‌తో బతికింది. వాళ్లందరికీ ఇంతటి మంచి ఆదాయం ఇచ్చిన సంతోషం నాకు ఉంది. నా వల్ల సుమారు 40 మంది కొత్త యూట్యూబర్స్‌కు బతుకుదెరువు దొరికింది. నేను ఎక్కడున్నా తిండి పెట్టే పనిలోనే ఉంటా.' అంటూ సోనియా పేర్కొంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది.

సోనియా కామెంట్లపై నెటిజన్ల నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. బిగ్‌ బాస్‌ షో గురించి అన్ని విషయాలు తెలిసే లోపలికి వెళ్లావ్‌ కదా అంటూ చెప్పుకొస్తున్నారు. గత సీజన్లలోని కొందరి కంటెస్టెంట్స్‌ పేర్లు గుర్తు చేస్తూ.. వారందరికంటే మరీ చెడ్డపేరు తెచ్చుకున్నావ్‌ అంటూ ఆమెపై మండి పడుతున్నారు. అయితే, మరికొందరు మాత్రం ఆమెను కావాలనే బిగ్‌ బాస్‌ చెడుగా చూపించే ప్రయత్నం చేశాడంటూ తప్పుపడుతున్నారు. ఏదేమైనా తనపై ఎన్ని ట్రోల్స్‌ వస్తున్నా వాటిని దాటుకొను సోనియా ముందుకు వెళ్తుంది. ఇక్కడే ఆమె ఎంత బలమైనదో తెలుస్తుందని అభిమానులు చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement