adireddy
-
బిగ్ బాస్,అదిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసిన సోనియా
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో సోనియా ఆకుల పేరు సోషల్‌మీడియాలో ట్రెండ్ అయింది. అయితే, బిగ్ బాస్‌లో పాల్గొన్న ఒక అమ్మాయిపై ఈ రేంజ్లో నెగెటెవిటీ, ట్రోలింగ్ జరగడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. ఇదంతా ఆమె మాటల వల్లే ఇబ్బందులు ఎదురయ్యాయని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన సోనియా ఇప్పటికే పలు ఇంటర్వ్యూలు ఇస్తూ ఇక్కడ కూడా వైరల్ అవుతుంది.షో నుంచి ఎలిమినేషన్ అయిన తర్వాత ఆమె ఇప్పటికే బిగ్ బాస్ మీద కూడా పలు ఆరోపణలు చేసింది. తన మాటల్ని ఇష్టమొచ్చినట్లుగా కట్ చేసి చూపించడమే కాకుండా.. తనను చాలా క్లోజప్ యాంగిల్స్‌లో ప్రేక్షకులకు చూపించారని తెలిపింది. బిగ్ బాస్ ఫేమ్ ఆదిరెడ్డి మీద కేసు పెట్టినట్లు ఇంటర్వ్యూ ద్వారా సోనియా తెలిపింది. రివ్యూల పేరుతో తనను కించపరిచేలా చాలా ఎక్కువగా చేసినట్లు ఆదిరెడ్డిపై ఆమె ఫైర్ అయింది. అయితే, ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోనవసరం లేదని తన కుటుంబ సభ్యులు చెప్పడంతో కేసు విషయంలో కాస్త తగ్గానని ఆమె తెలిపింది.'నా వల్ల నెలరోజుల పాటు రివ్యూవర్లు బాగా బతికారు.. నా గురించి వీడియోలు చేసుకుంటూ చాలామంది పంపాదించుకున్నారు. బిగ్ బాస్ షో కూడా ఈ 30 రోజులు నా వల్లే రేటింగ్‌తో బతికింది. వాళ్లందరికీ ఇంతటి మంచి ఆదాయం ఇచ్చిన సంతోషం నాకు ఉంది. నా వల్ల సుమారు 40 మంది కొత్త యూట్యూబర్స్కు బతుకుదెరువు దొరికింది. నేను ఎక్కడున్నా తిండి పెట్టే పనిలోనే ఉంటా.' అంటూ సోనియా పేర్కొంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.సోనియా కామెంట్లపై నెటిజన్ల నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. బిగ్ బాస్ షో గురించి అన్ని విషయాలు తెలిసే లోపలికి వెళ్లావ్ కదా అంటూ చెప్పుకొస్తున్నారు. గత సీజన్లలోని కొందరి కంటెస్టెంట్స్ పేర్లు గుర్తు చేస్తూ.. వారందరికంటే మరీ చెడ్డపేరు తెచ్చుకున్నావ్ అంటూ ఆమెపై మండి పడుతున్నారు. అయితే, మరికొందరు మాత్రం ఆమెను కావాలనే బిగ్ బాస్ చెడుగా చూపించే ప్రయత్నం చేశాడంటూ తప్పుపడుతున్నారు. ఏదేమైనా తనపై ఎన్ని ట్రోల్స్ వస్తున్నా వాటిని దాటుకొను సోనియా ముందుకు వెళ్తుంది. ఇక్కడే ఆమె ఎంత బలమైనదో తెలుస్తుందని అభిమానులు చెబుతున్నారు. View this post on Instagram A post shared by BigbossaaMajaakaa (@bigbossaamajaaka) -
మోరంపూడి ఫ్లైఓవర్ శిలాఫలకాన్ని టీడీపీ శ్రేణులు కూల్చేశారు
-
పింఛన్ల పంపిణీ ఆపింది మేమే : ఆదిరెడ్డి వాసు
రాజమహేంద్రవరం సిటీ: అవ్వాతాతలకు, దివ్యాంగులకు వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని అడ్డుకున్నది తామేనని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ–జనసేన–బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు వెల్లడించారు. రాజమహేంద్రవరంలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో వలంటీర్లు పింఛన్లు పంపిణీ చేస్తే వారు వైఎస్సార్సీపీకి ఓటు వేయాలంటూ ప్రచారం చేస్తారని, అదే జరిగితే తాము అడ్డుకుంటామని.. దీనివలన శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందంటూ తమ పార్టీ నగర అధ్యక్షుడు రెడ్డి మణి రిటర్నింగ్ అధికారికి చెప్పారని, డీఎస్పీ కూడా అది వాస్తవమని అన్నారని వాసు తెలిపారు. దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం రిటర్నింగ్ అధికారికి లేనందున ఈ విషయాన్ని తమ అధినేత చంద్రబాబు, లోకేశ్ దృష్టికి తీసుకుని వెళ్లానని ఆయన చెప్పారు. అందువల్లే ఎన్నికల కోడ్ ముగిసే వరకూ వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ చేయొద్దంటూ ఎన్నికల కమిషన్ ఆదేశించిందన్నారు. వాసు వ్యాఖ్యలతో దుమారం.. ఇక ఆదిరెడ్డి వాసు చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. పింఛన్ల పంపిణీ నుంచి వలంటీర్లను తప్పించింది తామేనని టీడీపీ నేతలు గర్వంగా చెప్పుకుంటూనే.. పింఛన్లు ఆగిపోవడంతో తమకేమీ సంబంధంలేదని, అది ఎలక్షన్ కమిషన్ నిర్ణయమని మరోవైపు కవర్ చేసుకోవడం వారి రెండు నాల్కల ధోరణికి అద్దంపడుతోందని అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది టీడీపీ దుర్బుద్ధిని బయటపెట్టిందంటున్నారు. ఇక ఎండ తీవ్రత పెరుగుతున్న సమయంలో టీడీపీ నాయకులు ఈ కుట్రలకు తెగబడడంపై వృద్ధులు, దివ్యాంగులు తెలుగుదేశాన్ని దుమ్మెత్తి పోస్తున్నారు. వారివల్లే ప్రతినెలా ఒకటో తేదీ వేకువనే వలంటీర్ల ద్వారా అందే పింఛను ఈ నెలలో తమకు అందకుండాపోయిందని పింఛనుదారులు వారిని శాపనార్థాలు పెడుతున్నారు. -
అయోధ్య రామ మందిరానికి బిగ్ బాస్ 'ఆదిరెడ్డి' విరాళం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీరాముడి భక్తులు భారీగా విరాళాలు అందించారు. ఆయల నిర్మాణం పూర్తిచేసుకుని రామమందిర ప్రాణ ప్రతిష్ఠకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. జనవరి 22న ఈ కార్యక్రమంగా ఘనంగా జరగనుంది. అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చి విరాళాలు సేకరించడం మొదలుపెట్టింది. దీంతో లక్షల మంది భక్తులు ముందుకు వచ్చారు. తాజాగా ఇప్పుడు ఆ జాబితాలోకి బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి కూడా చేరాడు. మొదట బిగ్ బాస్ షో మీద రివ్యూలు చేస్తూ ఫేమస్ అయిన ఆదిరెడ్డి.. కామన్ మ్యాన్ కోటాలో బిగ్ బాస్-6లోకి ఎంట్రీ ఇచ్చి.. ఎవరూ ఊహించని విధంగా టాప్-5 వరకు చేరుకున్నాడు. ఆయన జీవితాన్ని బిగ్ బాస్ మార్చేసింది అంటూ ఆయన పలుమార్లు చెబుతూ ఉంటాడు కూడా.. తాజాగా 'శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర' ట్రస్ట్‌కు తన వంతుగా ఒక లక్ష రూపాయలు ఆయన విరాళం అందించాడు. రామ మందిరం అనేది మనందరి కల, హిందువుల కల కాబట్టి తనవంతుగా ఉడుతా భక్తిగా ఈ విరాళం అందించానని ఆయన పేర్కొన్నాడు. అందరూ కూడా తమ వంతుగా డొనేట్ చేయాలని ఆయన చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు రామ మందిరానికి విరాళాల రూపంలో సుమారు రూ. 3,200 కోట్లు వచ్చినట్లు సమాచారం. బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాలలో ఈ డబ్బు జమ అయింది. దానిపై వచ్చిన వడ్డీతో ఇప్పటి వరకూ ఆలయ నిర్మాణం జరిగింది. View this post on Instagram A post shared by Adi Reddy (@adireddyofficial) -
దేశంలో దొంగలు పడ్డారు!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా’ అనే సామెత టీడీపీ నేతలకు సరిగ్గా సరిపోతుంది. ఆర్థిక నేరాల్లో తెలుగు తమ్ముళ్లది అందె వేసిన చెయ్యేనన్న విషయం ఆదిరెడ్డి అండ్ సన్ అరెస్టుతో మరోసారి చర్చల్లోకి వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నుంచి ద్వితీయ శ్రేణి నేతల వరకూ అందరిదీ ఒకటే మాట ఒకటే బాటగా అవినీతి రాజ్యమేలింది. జన్మభూమి కమిటీల పేరుతో తెలుగు తమ్ముళ్లు అడుగడుగునా ప్రజలను నిలువునా దోచుకున్నారు. ఇది చాలదా అన్నట్టు ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టి కోట్లకు కోట్ల రూపాయలు వసూలు చేసి పలాయనం చిత్తగించిన వారూ ఉన్నారు. వెంటాడుతున్న పాపాలు చిట్టీలు, ఫైనాన్స్‌ల పేరుతో ప్రజలను జలగల్లా పీక్కుతిన్న నేతలు ఒక్కొక్కరినీ రాష్ట్ర ప్రభుత్వం చట్ట ప్రకారం కటకటాల్లో వేస్తోంది. తాజాగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త వాసు, ఆయన తండ్రి, మాజీ ఎమ్మెల్సీ అప్పారావులను సీఐడీ అధికారులు ఆదివారం అరెస్టు చేసి, రిమాండుకు తరలించిన విషయం తెలిసిందే. చిట్‌ఫండ్ చట్టాన్ని తుంగలోకి తొక్కి, ఆర్థిక లావాదేవీల్లో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడుతున్న అభియోగాలపై వీరిని అరెస్టు చేశారు. చేసిన పాపాలు వెంటాడుతూనే ఉంటాయని పెద్దలు అంటారు. ఇప్పుడు ఆదిరెడ్డి విషయంలోనూ అదే జరిగిందని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. చిట్టీల పేరుతో చిట్‌ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి లావాదేవీలన్నింటినీ నగదు రూపంలో నిర్వహించడం.. ఒకచోట కార్యాలయం రిజిస్టర్ చేసి, మరోచోట నిర్వహించడం.. అసలు అనుమతి లేకుండానే కాకినాడలో ప్రాంతీయ కార్యా లయం నిర్వహించడం వంటి అనేక అవకతవకలకు పాల్పడి, ప్రజలను మోసగించారని సీఐడీ ప్రాథమికంగా నిగ్గు తేల్చింది. లోతైన విచారణ జరుపుతున్న సీఐడీ.. ఇందుకు సంబంధించిన కీలక ఆధారాలు సేకరించే పనిలో ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో తండ్రీకొడుకులకు ఉచ్చు బిగుస్తుందని ఆ పార్టీ నేతలే అంటున్నారు. ఇంకా ఎన్నో.. ► తెలుగు తమ్ముళ్ల అక్రమాల్లో కొన్ని బయట పడగా, వెలుగులోకి రానివి చాలానే ఉన్నాయని అంటున్నారు. ప్రజలను మోసగించి బాధితులు, పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న తెలుగు తమ్ముళ్లు చాలా మందే ఉన్నారు. ► తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు రెండో వార్డు టీడీపీ ఇన్చార్జి అక్కాబత్తుల చిన్నారావు ఇలానే చిట్టీల పేరుతో ప్రజలను నిలువునా ముంచేసి పరారైపోయాడు. ఏసీఆర్ చిట్స్ పేరుతో ప్రజల నుంచి డబ్బులు కొల్లగొట్టి, రెండేళ్ల క్రితం బోర్డు తిప్పేశాడు. ఈ తెలుగు తమ్ముడి చేతిలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని సుమారు 5 వేల మంది మోసపోయారు. చిన్నారావు ఏకంగా ఐదారు కోట్ల రూపాయలు కొల్లగొట్టేశాడు. అతడి మోసాలపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ► కోనసీమలో 1996 తుపాను అనంతరం బాధితులకు వచ్చిన రేషన్ బియ్యాన్ని నాటి ఎమ్మెల్యే దివంగత పులపర్తి నారాయణమూర్తి అడ్డంగా బొక్కేసినట్టు వచ్చిన ఆరోపణలు అప్పట్లో పెను సంచలనమే అయ్యాయి. ► ఉప్పలగుప్తం మండలానికి చెందిన మిల్లర్, అప్పటి జెడ్పీటీసీ సభ్యుడు దేశంశెట్టి లక్ష్మీనారాయణ టీడీపీ అధికారంలో ఉండగా పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం దారి మళ్లించాడు. టీడీపీ నేతలు గట్టి ఒత్తిడి తీసుకువచ్చినా ముక్కుసూటిగా పోయిన అప్పటి సీఐ వైఆర్కే శ్రీనివాస్ అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అయినప్పటికీ ఆ తెలుగు తమ్ముడి అక్రమాల దందాలో మార్పు రాలేదు. మరోసారి రేషన్ బియ్యాన్ని దారి మళ్లించిన వ్యవహారంలో అతడిపై ఉప్పలగుప్తం పోలీసులు తాజాగా మరో కేసు నమోదు చేయడం గమనార్హం. ఈవిధంగా నాటి నుంచి నేటి వరకూ టీడీపీలో చిన్నాచితకా నాయకుల నుంచి బడా నేతల వరకూ ఇదే పంథాలో అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. ‘సహకారం’తో అక్రమాలు ఇప్పుడంటే ఆదిరెడ్డి జగజ్జనని చిట్‌ఫండ్స్ బండారం బయటపడింది కాబట్టి సీఐడీ పోలీసులు పక్కా ఆధారాలతో అరెస్టు చేశారు. ఇంతకంటే ముందే టీడీపీ ఏలుబడిలో తూర్పు గోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ)లో జరిగిన కోట్లాది రూపాయల ఆర్థిక కుంభకోణం ఉమ్మడి జిల్లా ప్రజలకు తెలియంది కాదు. నాటి చైర్మన్‌గా ఉన్న ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి దివంగత వరుపుల రాజాపై సీఐడీ కేసు నమోదు చేయడం, ఆయన అరెస్టుకు ప్రయత్నించడం తెలిసిందే. ఆ సమయంలోనే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు, లంపకలోవ, లింగంపర్తి, కిర్లంపూడి, గండేపల్లి, కానవరం, భూపాలపట్నం, మొల్లేరు, రావుపాలెం, వద్దిపర్రు తదితర ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహించిన సొసైటీల అధ్యక్షులు కోట్లాది రూపాయలు దారి మళ్లించేసి రైతుల నోట మట్టి కొట్టారు. నాడు కోట్ల రూపాయలు కొల్లగొట్టిన అక్రమార్కులపై వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక సీఐడీ విచారణ జరిపిస్తోంది. వైరివర్గం ఖుషీ ఆదిరెడ్డి తండ్రీ తనయుల అరెస్టు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా టీడీపీలో హాట్ టాపిక్‌గా మారింది. నిత్యం ఎదుటి వారిపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న ఆ పార్టీ అగ్రనేతలకు వీరి అరెస్టులతో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయ్యింది. చిట్టీల పేరుతో చేసిన మోసాన్ని ఆధారాలతో సహా సీఐడీ బయట పెట్టడం వారికి మింగుడు పడటం లేదు. మొదటి నుంచీ రాజకీయంగా ఆదిరెడ్డిని వ్యతిరేకిస్తున్న వర్గం మాత్రం ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది. ఎక్కడా బయట పడకుండా అంతర్గతంగా సంబరాలు చేసుకుంటోంది. రాజమహేంద్రవరం సిటీపై ఆధిపత్యం కోసం ఇటు ఆదిరెడ్డి, అటు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి వర్గాలు చాలాకాలం నుంచి నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ పడుతున్నాయి. పార్టీపై గుత్తాధిపత్యాన్ని అధిష్టానం తమ కుటుంబానికే రాసి ఇచ్చేసినట్టు ఏకపక్షంగా వ్యవహరిస్తూ వచ్చిన ఆదిరెడ్డికి తగిన శాస్తే జరిగిందని ఆయన వైరి వర్గంగా ముద్రపడిన గోరంట్ల అనుయాయులు అంటున్నారు. అలాగని ఆదిరెడ్డి అరెస్టులపై పెదవి విప్పడానికి ఆ పార్టీ నేతలెవరూ ముందుకు రావడం లేదు. -
కంటెస్టెంట్స్‌కి బిగ్‌బాస్ అమూల్యమైన అవకాశం, ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలవాలంటే..
బిగ్‌బాస్ 6 తెలుగు: కంటెస్టెంట్‌కి బిగ్‌బాస్ అమూల్యమైన అవకాశాన్ని ఇచ్చాడు. ఎలిమినేషన్ లేకుండా చివరి వరకు హౌజ్ కొనసాగేందుకు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకునేందుకు వారికి సదా అవకాన్ని ఇచ్చాడు. అయితే గెలుచుకునేందుకు కంటెస్టెంట్స్‌కి కఠిమైన టాస్క్‌తో పాటు వారి ప్రైజ్‌మనీలోంచి భారీగా కోతలు పెట్టాడు బిగ్‌బాస్. చదవండి: తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్న జబర్దస్త్ కమెడియన్, నడవలేని స్థితిలో.. దీంతో ఆదిరెడ్డి ఈ పాస్ తనకు వద్దంటూ టాస్క్ ఆడని తేల్చేశాడు. ఇక హౌజ్ అందరు చర్చించుకున్న అనంతరం ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం రేవంత్, శ్రీహాన్, ఫైమా పార్టిసిపేట్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎవరు గెలిచి ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకుంటారో చూడాలంటే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే. -
Bigg Boss 6: కంట్రోల్ తప్పిన రోహిత్.. బ్యాగ్‌ని కాలితో తన్నుతూ.. ఫుల్ ఫైర్
బిగ్‌బాస్ హౌస్‌లో టాస్క్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా పదోవారం ఇంటి సభ్యులు రెచ్చిపోయి ఆడుతున్నారు. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ మరింత వాడివేడిగా జరిగినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. కెప్టెన్సీ పోటీదారుల కోసం ఇచ్చిన ‘నాగమణి’టాస్క్‌లో విజయం సాధించిన పాముల టీమ్ సభ్యులు ఆదిరెడ్డి, రోహిత్, కీర్తిలతో పాటు శ్రీసత్య, మెరీనా కూడా ఈ వారం కెప్టెన్సీ పోటీలో నిలిచారు. వీరికి ‘వస్తా నీవెనుక’అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా థర్మాకోల్ బాల్స్ నిండి ఉన్న బ్యాగ్‌లను కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో ఆదిరెడ్డి.. రోహిత్, మెరినాలను టార్గెట్ చేసినట్లు చేసింది. అందరికంటే ముందే మెరినా టాస్క్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక రోహిత్‌పై అటాక్‌కి వెళ్లిన ఆదిరెడ్డికి ఫైమా తోడైంది. ఇద్దరు కలిసి రోహిత్‌ని బ్యాగ్‌ను చించేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రోహిత్ సంచాలక్‌పై ఫైర్ అయ్యాడు. ఆదిరెడ్డి బ్యాగ్ పట్టుకుంటే ఏం అనలేదు కానీ.. నన్ను మాత్రం అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాగ్‌ని కాలితో తన్నుతూ.. ‘నేను బ్యాగ్‌ని పట్టుకోలేదు’ అని గట్టిగా అరుస్తూ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అయితే మెరినా మాత్రం రోహిత్‌ని కూల్ చేస్తూ..‘జనాలు చూస్తున్నారు’లే అని సర్థిచెప్పింది. అయినా రోహిత్ కోపం చల్లారలేదు. ఇక ఈ టాస్క్‌లో గెలిచి కెప్టెన్ అయిందెవరు అనేది నేటి ఎపిసోడ్లో తెలుస్తుంది. -
‘బిగ్‌బాస్’లో చేపల లొల్లి.. వెక్కి వెక్కి ఏడ్చిన గీతూ
బిగ్‌బాస్ హౌస్‌లో ఈ వారం మొదలైన కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ రసవత్తరంగా సాగింది. కెప్టెన్సీ రేసులో నిలిచేందుకు హౌస్‌మేట్స్‌కి ‘చేపల చెరువు’ అనే టాస్క్ఇచ్చాడు బిగ్‌బాస్. దీని కోసం ఇంటి సభ్యులను జంటలుగా విడదీశాడు. సూర్య- వసంతి, రేవంత్- ఇనయ, శ్రీహాన్- శ్రీసత్య, బాలాదిత్య -మెరీనా, ఆదిరెడ్డి -గీతు, రోహిత్ -కీర్తి, రాజ్- పైమా జంటలుగా విడిపోయి, గార్డెన్ ఏరియాలో కురిసే చేపల వర్షంలో చేపలను పట్టుకోవాలి. టాస్క్ మధ్యలో బిగ్‌బాస్ అడిగినప్పుడు ఏ జంట దగ్గర తక్కువ చేపలు ఉంటాయో.. ఆ జంట ఈ టాస్క్ నుంచి తప్పుకుంటుంది. మధ్య మధ్యలో బిగ్‌బాస్ ఇచ్చే చాలెంజ్‌లు గెలిచిన జంట తమ చేపల సంఖ్యను పెంచుకోవచ్చు. చాలెంజ్‌లో పోటీపడేందుకు హారన్ మోగినప్పుడు గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ ఫూల్లోకి ప్రతి జంట నుంచి ఒకరు దిగి గొల్డ్ కాయిన్ని వెతకాల్సి ఉంటుంది. గోల్డ్ కాయిన్ దొరికిన జంట చాలెంజ్‌లో పాల్గొనడమే కాకుండా.. తమతో ఎవరు పోటీ పడొచ్చో కూడా ఎంచుకునే అవకాశం ఉంది. ఇక టాస్క్‌లో ఫిజికల్‌గా గెలవలేమని భావించిన గీతూ, ఆదిరెడ్డి.. మాటలతో ఆటలో చిచ్చు పెట్టాలని ప్లాన్ వేసింది. రేవంత్‌ని మాటలతో రెచ్చగొట్టి ఆపితే..ఇనయా ఎక్కువగా చేపలు ఏరలేదని ఆదిరెడ్డికి ముందే చెప్పింది. అయితే గీతూ ప్లాన్ వర్కౌట్ కాలేదు. చేపల వర్షం పడినప్పుడు అందరూ పోటీపడి మరి చేపలను ఏరుకున్నారు. ఇక తక్కువ చేపలు ఏరుకున్న గీతూ.. వాసంతి బుట్ట నుంచి చేపలను దొంగిలించేందుకు ప్రయత్నించింది. కానీ సూర్య అడ్డుకున్నాడు. దీంతో మెరినాను టార్గెట్ చేసింది. అయితే బాలాదిత్యతో పాటు రోహిత్ కూడా గీతూని అడ్డుకున్నారు. దీంతో రోహిత్, మెరినా కలిసి ఆడుతున్నారని, నిజం ఒప్పుకోవడానికి నాలాగా గట్స్ ఉండాలంటూ రెచ్చగొట్టింది. ‘నువ్వు నా జోలికి రావొద్దు’అంటూ మెరీనా గీతూపై ఫైర్ అయింది. తాను అందరిని టార్గెట్ చేస్తానని, ప్రతి ఒక్కరి బుట్టలో నుంచి చెపలు దొంగిలిస్తానని చెప్పింది. ఈ గొడవల మధ్యే హారన్ మోగింది. దీంతో ప్రతి జంట నుంచి ఒక్కొక్కరు గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన స్మిమింగ్‌ఫూల్‌లోకి వెళ్లారు. అయితే అనూహ్యంగా గోల్డ్ కాయిన్ రేవంత్‌కి దొరికింది. అనంతరం బిగ్‌బాస్ ఆదేశాల మేరకు చేపలను లెక్కించగా.. గీతూ, ఆదిరెడ్డి జంట దగ్గర తక్కువ సంఖ్యలో చేపలు లభించడంతో టాస్క్ నుంచి తప్పుకుంది. ఇక బిగ్‌బాస్ ఇచ్చిన ఫస్ట్ ఛాలెంజ్ ‘ఫుష్ ఫర్ ఫిష్ ’లో రేవంత్‌తో పోటీపడేందుకు రాజ్-ఫైమా, శ్రీహాన్- శ్రీసత్య, బాలాదిత్య -మెరీనా బరిలోకి దిగారు. ఈ చాలెంజ్‌లో రాజ్-ఫైమా జంట విజేతగా నిలిచి 10 చేపలను దక్కించుకుంది. హారన్ మోగినప్పుడు మైక్ ధరించి స్విమ్మింగ్ ఫూల్లోకి దిగిన కారణంగా శ్రీసత్య, సూర్య జంటల నుంచి 10 చేపలను వెనక్కి తీసుకున్నాడు బిగ్‌బాస్. టాస్క్ సమయం ముగిసేసరికి రేవంత్-ఇనయా జంట దగ్గర అత్యధిక చేపలు ఉన్నాయి. అయితే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ నుంచి తప్పుకోవడంతో గీతూ వెక్కివెక్కి ఏడ్చింది. టాస్క్ కోసమే అందరిని రెచ్చగొట్టానని హౌస్‌మేట్స్‌కి చెబుతూ.. కన్నీళ్లు పెట్టుకుంది. టాస్‌లో తనను నెట్టేసిన రేవంత్‌ని కాలితో తన్నడంతో పాటు బూతు పదాన్ని వాడానని, అందుకు క్షమాపణ కోరుతున్నానని చెప్పింది. రేవంత్ కూడా దానిని పెద్దగా పట్టించుకోలేదని, అనుకోకుండా నెట్టేశానని చెప్పింది. మరి ‘చేపల చెరుపు’టాస్క్‌లో చివరకు ఎవరు గెలిచి కెప్టెన్స్ అవుతారో చూడాలి. -
Bigg Boss 6: ‘కుర్రాడు బాబోయ్’ డీజే సాంగ్‌కి ఆదిరెడ్డి స్టెప్పులేస్తే..
బిగ్‌బాస్ హౌస్‌లో ఆదివారం ఆటలు, పాటలు కామన్. నాగార్జన వచ్చి కంటెస్టెంట్స్‌తో చిన్న చిన్న గేమ్స్ ఆడించి, చివరకు ఒకరిని ఎలిమినేట్ చేసి వెళ్తాడు. ఈ ఆదివారం కూడా హౌస్మెట్స్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. కంటెస్టెంట్స్‌తో‘సుత్తిదెబ్బ’గేమ్ ఆడించాడు నాగ్. ఒక్కొక్కరు లేచి నాగ్ అడిగే ప్రశ్నకు సూట్ అయ్యే వ్యక్తిపై సుత్తితో కొట్టాలి. ఈ గేమ్ చాలా ఫన్నీగా సాగినట్లు తెలుస్తోంది. ఈ హౌస్‌లో ఫేక్ కంటెస్టెంట్ ఎవరని ఫైమాని అడగ్గా.. ఆరోహి పేరు చెబుతూ ఆమె తలపై సుత్తితో కొట్టింది. ఇక నోటిదూల ఎవరికి ఎక్కువ అని అడగ్గా.. ఆదిరెడ్డి వెళ్లి గీతూ తలపై కొట్టాడు. ఈ విషయాన్ని ఆడియన్స్ కూడా ఇనామస్‌గా ఒప్పుకున్నారు. ఇక హౌస్‌లో తిండిబోతు రోహిత్ అని సుదీప చెప్తే..ఆడియన్స్ మాత్రం శ్రీసత్యకు ఓటేశారు. ఇక ఈ గేమ్ చివరల్లో కంటెస్టెంట్స్ అంతా 'కుర్రాడు బాబోయ్ కుంపటెట్టినాడు'డీజే సాంగ్‌కు స్టెప్పులేసి అలరించాడు. నాగార్జున మాత్రం ఆదిరెడ్డిని ప్రత్యేకంగా మరోసారి ఆ పాటకు డ్యాన్స్ చేయమని అడగడంతో ఆయన..తనకు వచ్చిన స్టెప్పులతో మ్యానేజ్ చేశాడు. ఆదిరెడ్డి స్టెప్పులు చూసి నాగార్జున పగలబడి నవ్వాడు. ఇక హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారనేది ఈ రోజు ఎపిసోడ్లో తేలిపోతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ వారం నేహా ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. -
Bigg Boss 6: మధ్యలో దూరడం బాగా అలవాటైంది..ఆదిరెడ్డిపై నాగ్ ఫైర్
బిగ్‌బాస్ రియాల్టీ షో అభిమానులకు శని, ఆదివారాలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఆ రోజు హోస్ట్ నాగార్జున వచ్చి వారంలో కంటెస్టెంట్స్ చేసిన తప్పులపై క్లాస్ తీసుకుంటాడు. అంతేకాదు వాళ్లతో ఫన్నీ గేమ్స్ ఆడించి, చివరకు ఒకరిని హౌస్‌లో నుంచి బయటకు పంపుతాడు. అందుకే ఈ రెండు రోజుల కోసం ‘బిగ్‌బాస్’ప్రేమికులు ఎదురుచూస్తుంటారు. ఇక బిగ్‌బాస్ ఆరో సీజన్లో తొలి వీకెండ్ డే రానే వచ్చేసింది. నేడు(శనివారం) హోస్ట్ నాగార్జున వచ్చి ఇంటి సభ్యుల పంచాయితీపై తన తీర్పుని ఇచ్చేశాడు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. (చదవండి: బిగ్‌బాస్ విన్నర్ అని చెప్పుకోవడం మానేశాను : వీజే సన్నీ) ఇందులో గీతు, ఆదిరెడ్డి, రేవంత్‌లకు గట్టి క్లాస్ పీకాడు హోస్ట్ నాగార్జున. బిగ్‌బాస్ కంటెసెంట్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ కాలేరన్న గీతూకి తనదైన శైలీలో కౌంటర్ ఇచ్చాడు. ఇక హౌస్‌లో బూతులు ఎక్కువగా మాట్లాడుతున్నావని రేవంత్‌కి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. రోహిత్, మెరీనా జంటల మధ్య ఏర్పడిన వివాదానికి తెరదించాడు. మెరీనాని దూరం పెట్టాల్సిన అవసరం లేదని, నీకు అల్రెడీ లైసెన్స్(పెళ్లి) ఉందని, అందరి ముందు హగ్ చేసుకోవచ్చని చెప్పడమే కాకుండా.. అందరి ముందు టైట్ హగ్ ఇవ్వాలని కోరాడు. ఆరోహి,రేవంత్ గొడవ గురించి మాట్లాడుతూ..‘ఓడిపోయిన బాధలో వెనక్కొచ్చిన ఆరోహిని ఆ మాట అనడం అవసరమా? అని రేవంత్‌ని నిలదీశాడు. ఆమె క్షమాపణలు చెప్పడానిని వచ్చినప్పుడు మధ్యలో దూరిన గీతూ, ఆదిరెడ్డిలను కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. వాళ్లకి(గీతూ, ఆదిరెడ్డి) రివ్యూలు చేసి చేసి మధ్యలో దూరడం అలవాటైందని నాగ్ సీరియస్ అయ్యాడు. హౌస్‌మేట్స్‌తో నాగార్జున ఇంకా ఏమేమి పనులు చేయించాడు? వారి మధ్య ఉన్న వివాదాలను ఎలా పరిష్కరించారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
చెస్ టోర్నీ విజేత అర్జున్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అండర్ –19 జూనియర్ చెస్ టోర్నమెంట్లో హైదరాబాద్ జిల్లాకు చెందిన ఆదిరెడ్డి అర్జున్ విజేతగా నిలిచాడు. ఆరు రౌండ్లపాటు నిర్వహించిన ఈ టోర్నీలో అర్జున్ 5.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని సంపాదించాడు. చివరిదైన ఆరో రౌండ్లో చల్లా సహర్షపై అర్జున్ గెలుపొందాడు. ఈ టోర్నీలో అర్జున్ ఐదు గేముల్లో గెలిచి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. మొహమ్మద్ బాషిక్ ఇమ్రోజ్ (నల్లగొండ) రన్నరప్‌గా, సీహెచ్ కార్తీక్‌సాయి (రంగారెడ్డి) మూడో స్థానంలో, విహాన్ కార్తికేయ (రంగారెడ్డి) నాలుగో స్థానంలో నిలిచారు. తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
ఆదిరెడ్డి హత్యకేసు నిందితుల అరెస్టు
ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఆరుగురు వ్యక్తులను నల్లగొండ జిల్లా పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పెద్ద ఊర మండల కేంద్రానికి చెందిన ఆదిరెడ్డి (49)ని భూతగాదాలు, పాత కక్షల నేపథ్యంలో ఈ నెల 7న కొందరు కారుతో యాక్సిడెంట్ చేసి.. కర్రలతో కొట్టి చంపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ అనంతరం.. హత్యకు పాల్పడిన ఆరుగురిని పెద్ద ఊర మండలం పొట్టిగానితండా వద్ద అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో నాగార్జునరెడ్డి, వెంకట్‌రెడ్డి, హర్షవర్దన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శశిధర్‌రెడ్డితోపాటు మరో వ్యక్తి ఉన్నాడు. -
బండరాయితో కొట్టి చంపేశారు..!
నల్లగొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మండల కేంద్రానికి చెందిన పున్రెడ్డి ఆదిరెడ్డి(50) సోమవారం రాత్రి స్థానిక ఎంఈవో కార్యాలయం వైపు నుంచి నడిచి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో మోది చంపేశారు. వ్యక్తి గత కక్షల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రొటోకాల్ ఉల్లంఘనపై ఆదిరెడ్డి ఆగ్రహం
రాజమండ్రి కార్పొరేషన్ : ప్రొటోకాల్ ఉల్లంఘనపై ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీనైన తనను కార్యక్రమానికి సరిగా ఆహ్వానించకపోవడంపై విద్యుత్ శాఖాధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అభివృద్ధి కార్యక్రమాల అమలులో తనను భాగస్వామిని చేయకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. స్థానిక కోరుకొండ రోడ్డులోని మార్కెట్ యార్డులో నూతనంగా నిర్మించనున్న సబ్‌స్టేషన్‌కు మంగళవారం శంకుస్థాపన జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు హాజరుకాకుండానే శంకుస్థాపన ప్రారంభించేశారు. విషయం తెలుసుకున్న ఆదిరెడ్డి అక్కడికి చేరుకున్నారు. తాను రాకుండా సబ్‌స్టేషన్ శంకుస్థాపన ఎలా చేశారంటూ ఆ శాఖ అధికారులపై మండిపడ్డారు. తనకు ముందుగా ఎందుకు సమాచారం ఇవ్వలేదంటూ విద్యుత్ శాఖ అధికారులను నిలదీసి, అక్కడ బైఠాయించారు. వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీనైన తనను చిన్నచూపు చూడడం సబబుకాదంటూ దుయ్యబట్టారు. అభివృద్ధి కార్యక్రమాల్లో తనకూ భాగస్వామ్యం ఉందని, ఇటువంటి చర్యలు మానుకోకపోతే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. మరోసారి పునరావృతమైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సి వస్తుందన్నారు. అనంతరం సబ్ స్టేషన్ నిర్మాణానికి కొబ్బరి కాయకొట్టి పనులు ప్రారంభించారు.