Bigg Boss 6 Telugu Today Latest Promo: Rohit Fires On Revanth In Captaincy Task - Sakshi
Sakshi News home page

Bigg Boss 6: కంట్రోల్‌ తప్పిన రోహిత్‌.. బ్యాగ్‌ని కాలితో తన్నుతూ.. ఫుల్‌ ఫైర్‌

Published Thu, Nov 10 2022 2:00 PM | Last Updated on Thu, Nov 10 2022 3:39 PM

Bigg Boss 6 Telugu Latest Promo: Rohit Fires On Revanth - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో టాస్క్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా పదోవారం ఇంటి సభ్యులు రెచ్చిపోయి ఆడుతున్నారు.  ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌ మరింత వాడివేడిగా జరిగినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. కెప్టెన్సీ పోటీదారుల కోసం ఇచ్చిన ‘నాగమణి’టాస్క్‌లో విజయం సాధించిన  పాముల టీమ్‌ సభ్యులు ఆదిరెడ్డి, రోహిత్‌, కీర్తిలతో పాటు శ్రీసత్య, మెరీనా కూడా ఈ వారం కెప్టెన్సీ పోటీలో నిలిచారు. వీరికి ‘వస్తా నీవెనుక’అనే టాస్క్‌ ఇచ్చారు.

ఇందులో భాగంగా థర్మాకోల్ బాల్స్‌ నిండి ఉన్న బ్యాగ్‌లను  కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో ఆదిరెడ్డి.. రోహిత్‌, మెరినాలను టార్గెట్‌ చేసినట్లు చేసింది. అందరికంటే ముందే మెరినా టాస్క్‌ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక రోహిత్‌పై అటాక్‌కి వెళ్లిన ఆదిరెడ్డికి ఫైమా తోడైంది. ఇద్దరు కలిసి రోహిత్‌ని బ్యాగ్‌ను చించేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రోహిత్‌ సంచాలక్‌పై ఫైర్‌ అయ్యాడు.

ఆదిరెడ్డి బ్యాగ్‌ పట్టుకుంటే ఏం అనలేదు కానీ.. నన్ను మాత్రం అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాగ్‌ని కాలితో తన్నుతూ.. ‘నేను బ్యాగ్‌ని పట్టుకోలేదు’ అని గట్టిగా అరుస్తూ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అయితే మెరినా మాత్రం రోహిత్‌ని కూల్‌ చేస్తూ..‘జనాలు చూస్తున్నారు’లే అని సర్థిచెప్పింది. అయినా రోహిత్‌ కోపం చల్లారలేదు. ఇక ఈ టాస్క్‌లో గెలిచి కెప్టెన్‌ అయిందెవరు అనేది నేటి ఎపిసోడ్‌లో తెలుస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement