Bigg Boss Telugu 6, Episode 40: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్‌లో ప్రస్తుతం బ్యాటరీ రీచార్జ్ టాస్క్ నడుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే శ్రీహాన్, శ్రీసత్య, సుదీప, బాలాదిత్య, ఇనయ, అర్జున్, ఆది రెడ్డి, గీతూలకు సర్‌ప్రైజ్‌లు అందాయి. వారు ఎంచుకున్న ఆప్షన్‌ను బట్టి ఇంటిసభ్యులతో ఆడియో కాల్, వీడియో కాల్, ఫొటో ఫ్రేమ్, ఫుడ్ అందుకున్నారు. మిగిలిన హౌస్‌మేట్స్ నేడు వారి ఫ్యామిలీతో మాట్లాడారు. మరి ఎవరికి ఎలాంటి సర్‌ప్రైజ్‌లు అందాయో తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..
ఇనయ- సూర్యలు ఒకరికొకరు ఫెవికాల్‌లా అతుక్కుపోయారు. ఇప్పటిదాకా ఒకరికొకరు గోరుముద్దలు పెట్టుకున్న ఈ ఇద్దరు పొద్దుపొద్దున్నే ఒకరి లాలీపాప్‌ను మరొకరు చప్పరించారు. ఇనయ లాలీపాప్ తింటూ దాన్ని సూర్యతో షేర్ చేసుకుంది. అతడు కూడా వద్దనుకుండా దాన్ని నోట్లో పెట్టుకోవడం గమనార్హం. అటు బాలాదిత్య సిగరెట్లు లేక అల్లాడిపోయాడు. పొద్దునకల్లా తిరిగి పంపించేస్తాను ఒక్కసారి సిగరెట్లు ఇవ్వండి బిగ్‌బాస్ అని కెమెరాల దగ్గర మొత్తుకున్నాడు. కానీ బిగ్‌బాస్ ఏడిపించే రకమే కానీ కరుణించే రకం కాదు కదా!
మరోవైపు అన్నం సరిపోవట్లేదు కొంచెం ఎక్కువ వండమని ఆదిరెడ్డి కెప్టెన్‌ను అడిగాడు. దానికతడు రైస్ వేస్ట్ కాకూడదు అంటూ కస్సుబుస్సులాడాడు. నీ కెప్టెన్సీలో అన్నం లేక ఇబ్బందిపడటం మీకు ఇష్టమా? అని ఆదిరెడ్డి ప్రశ్నించగా మీరు ఇబ్బందిపడ్డారా? అంటూ అడ్డదిడ్డంగా మాట్లాడాడు రేవంత్. రైస్ ఎక్కువ ఉంది కాబట్టే అడిగానని ఆదిరెడ్డి చెప్తున్నా అతడు వినిపించుకోలేదు. ఇంతలో టెలిఫోన్ బూత్‌కు బిగ్‌బాస్ కాల్ చేశాడు. రోహిత్, వాసంతిలలో ఎవరైనా ఒకరు రెండు వారాలు స్వతాహాగా నామినేట్ అయితే బ్యాటరీ ఫుల్‌గా రీచార్జ్ అవుతుందన్నాడు. ఇంటిసభ్యుల కోసం తాను నామినేట్ అవడానికి సిద్ధమని రోహిత్ వెల్లడించడంతో బ్యాటరీ వంద శాతం రీచార్జ్ అయింది. కాకపోతే ఈసారి బిగ్‌బాస్ పిలవడం కాకుండా ఫోన్ రింగ్ అయినప్పుడు ఎవరు ముందుగా లిఫ్ట్ చేస్తే వారికే సర్‌ప్రైజ్ ఉంటుందన్నాడు.
మొదటగా రేవంత్ కాల్ లిఫ్ట్ చేశాడు. అతడు 10 శాతం రీచార్జ్ వినియోగిస్తూ భార్య ఫొటో సెలక్ట్ చేసుకున్నాడు. ఫైమా 25 శాతం రీచార్జ్ ఉపయోగించి అమ్మతో వీడియో కాల్ మాట్లాడింది. కీర్తి.. 15 శాతం ఉన్న మానస్ ఆడియో మెసేజ్ విని సంతోషపడింది. సూర్య.. 20 శాతం ఉన్న అమ్మ లేఖ అందుకుని చదివి మురిసిపోయాడు. వాసంతి.. 15 శాతం రీచార్జ్ ఉన్న అక్క కూతురి ఫొటో తీసుకుంది. రాజ్.. 15 శాతం రీచార్జ్ వినియోగిస్తూ అమ్మతో ఆడియో కాల్ తీసుకున్నాడు. రోహిత్, మెరీనాలకు అవకాశం రాకుండానే బ్యాటరీ రీచార్జ్ మొత్తం అయిపోయింది.
నిజానికి రోహిత్ వల్లే బ్యాటరీ రీచార్జ్ అయినా అతడికి, మెరీనాకు మాత్రం ఫ్యామిలీతో మాట్లాడేందుకు ఛాన్స్ లేకుండా పోయింది. అనంతరం కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. అందులో భాగంగా బంతిని వారి బాస్కెట్‌లో వేయాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో కిందామీదా పడ్డ హౌస్‌మేట్స్‌కు స్వల్పంగా గాయాలైనట్లు తెలుస్తోంది. అయినప్పటికీ పట్టు విడవకుండా గేమ్ ఆడి రేవంత్, వాసంతి, ఆదిరెడ్డి, సూర్య, శ్రీసత్య, రాజ్, అర్జున్, రోహిత్ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు.
చదవండి: శ్రీసత్య కన్నింగ్, వాసంతి ఎడ్డిది: స్రవంతి
సినిమా ఛాన్స్ పేరుతో నన్ను ఇంటికి పిలిచి... బిగ్‌బాస్ కంటెస్టెంట్ బండారం బయటపెట్టిన నటి
Comments
Please login to add a commentAdd a comment