Bigg Boss Telugu 6:Geetu Royal Emotional | Bigg Boss 6 Telugu Episode 52 Highlights - Sakshi
Sakshi News home page

Bigg Boss 6: ‘బిగ్‌బాస్‌’లో చేపల లొల్లి.. వెక్కి వెక్కి ఏడ్చిన గీతూ

Published Wed, Oct 26 2022 8:43 AM | Last Updated on Wed, Oct 26 2022 9:22 AM

Bigg Boss 6 Telugu: Geetu Rayal Emotional,Episode 52 Highlights - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఈ వారం మొదలైన కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ రసవత్తరంగా సాగింది. కెప్టెన్సీ రేసులో నిలిచేందుకు హౌస్‌మేట్స్‌కి ‘చేపల చెరువు’ అనే టాస్క్ఇచ్చాడు బిగ్‌బాస్‌. దీని కోసం ఇంటి సభ్యులను జంటలుగా విడదీశాడు.  సూర్య- వసంతి, రేవంత్- ఇనయ, శ్రీహాన్- శ్రీసత్య, బాలాదిత్య -మెరీనా,  ఆదిరెడ్డి -గీతు, రోహిత్ -కీర్తి, రాజ్- పైమా జంటలుగా విడిపోయి, గార్డెన్‌ ఏరియాలో కురిసే చేపల వర్షంలో చేపలను పట్టుకోవాలి. టాస్క్‌ మధ్యలో బిగ్‌బాస్‌ అడిగినప్పుడు ఏ జంట దగ్గర తక్కువ చేపలు ఉంటాయో.. ఆ జంట ఈ టాస్క్‌ నుంచి తప్పుకుంటుంది. మధ్య మధ్యలో బిగ్‌బాస్‌ ఇచ్చే చాలెంజ్‌లు గెలిచిన జంట తమ చేపల సంఖ్యను పెంచుకోవచ్చు.

చాలెంజ్‌లో పోటీపడేందుకు హారన్‌ మోగినప్పుడు గార్డెన్‌ ఏరియాలో ఏర్పాటు చేసిన స్విమ్మింగ్‌ ఫూల్‌లోకి ప్రతి జంట నుంచి ఒకరు దిగి గొల్డ్‌ కాయిన్‌ని వెతకాల్సి ఉంటుంది. గోల్డ్‌ కాయిన్‌ దొరికిన జంట చాలెంజ్‌లో పాల్గొనడమే కాకుండా.. తమతో ఎవరు పోటీ పడొచ్చో కూడా ఎంచుకునే అవకాశం ఉంది.  ఇక టాస్క్‌లో ఫిజికల్‌గా గెలవలేమని భావించిన గీతూ, ఆదిరెడ్డి.. మాటలతో ఆటలో చిచ్చు పెట్టాలని ప్లాన్‌ వేసింది. రేవంత్‌ని మాటలతో రెచ్చగొట్టి ఆపితే..ఇనయా ఎక్కువగా చేపలు ఏరలేదని ఆదిరెడ్డికి ముందే చెప్పింది. అయితే గీతూ ప్లాన్‌ వర్కౌట్‌ కాలేదు.

చేపల వర్షం పడినప్పుడు అందరూ పోటీపడి మరి చేపలను ఏరుకున్నారు. ఇక తక్కువ చేపలు ఏరుకున్న గీతూ.. వాసంతి బుట్ట నుంచి చేపలను దొంగిలించేందుకు ప్రయత్నించింది. కానీ సూర్య అడ్డుకున్నాడు. దీంతో మెరినాను టార్గెట్‌ చేసింది. అయితే బాలాదిత్యతో పాటు రోహిత్‌ కూడా గీతూని అడ్డుకున్నారు. దీంతో రోహిత్‌, మెరినా కలిసి ఆడుతున్నారని, నిజం ఒప్పుకోవడానికి నాలాగా గట్స్‌ ఉండాలంటూ రెచ్చగొట్టింది. ‘నువ్వు నా జోలికి రావొద్దు’అంటూ మెరీనా గీతూపై ఫైర్‌ అయింది. తాను అందరిని టార్గెట్‌ చేస్తానని, ప్రతి ఒక్కరి బుట్టలో నుంచి చెపలు దొంగిలిస్తానని చెప్పింది.

ఈ గొడవల మధ్యే హారన్‌ మోగింది. దీంతో ప్రతి జంట నుంచి ఒక్కొక్కరు గార్డెన్‌ ఏరియాలో ఏర్పాటు చేసిన స్మిమింగ్‌ఫూల్‌లోకి వెళ్లారు. అయితే అనూహ్యంగా గోల్డ్‌ కాయిన్‌ రేవంత్‌కి దొరికింది. అనంతరం బిగ్‌బాస్‌ ఆదేశాల మేరకు చేపలను లెక్కించగా.. గీతూ, ఆదిరెడ్డి జంట దగ్గర తక్కువ సంఖ్యలో చేపలు లభించడంతో టాస్క్‌ నుంచి తప్పుకుంది. ఇక బిగ్‌బాస్‌ ఇచ్చిన ఫస్ట్ ఛాలెంజ్ ‘ఫుష్ ఫర్ ఫిష్ ’లో రేవంత్‌తో పోటీపడేందుకు రాజ్‌-ఫైమా, శ్రీహాన్- శ్రీసత్య, బాలాదిత్య -మెరీనా బరిలోకి దిగారు. ఈ చాలెంజ్‌లో రాజ్‌-ఫైమా జంట విజేతగా నిలిచి 10 చేపలను దక్కించుకుంది.

హారన్‌ మోగినప్పుడు మైక్‌ ధరించి స్విమ్మింగ్‌ ఫూల్‌లోకి దిగిన కారణంగా శ్రీసత్య, సూర్య జంటల నుంచి 10 చేపలను వెనక్కి తీసుకున్నాడు బిగ్‌బాస్‌.  టాస్క్‌ సమయం ముగిసేసరికి రేవంత్‌-ఇనయా జంట దగ్గర అత్యధిక చేపలు ఉన్నాయి. అయితే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ నుంచి తప్పుకోవడంతో గీతూ వెక్కివెక్కి ఏడ్చింది. టాస్క్‌ కోసమే అందరిని రెచ్చగొట్టానని హౌస్‌మేట్స్‌కి చెబుతూ.. కన్నీళ్లు పెట్టుకుంది. టాస్‌లో తనను నెట్టేసిన రేవంత్‌ని కాలితో తన్నడంతో పాటు బూతు పదాన్ని వాడానని, అందుకు క్షమాపణ కోరుతున్నానని చెప్పింది. రేవంత్‌ కూడా దానిని పెద్దగా పట్టించుకోలేదని, అనుకోకుండా నెట్టేశానని చెప్పింది. మరి ‘చేపల చెరుపు’టాస్క్‌లో చివరకు ఎవరు గెలిచి కెప్టెన్స్‌ అవుతారో చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement