Bigg Boss 6 Telugu: Singer Revanth Slams Geetu Royal - Sakshi
Sakshi News home page

Bigg Boss 6: ఛీఛీ.. అలాంటి వాళ్లని ‘బిగ్‌బాస్‌’లోకి ఎందుకు పిలిచారో: రేవంత్‌

Published Sun, Sep 25 2022 11:22 AM | Last Updated on Sun, Sep 25 2022 12:20 PM

Bigg Boss 6 Telugu: Singer Revanth Slams Geetu Royal - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రస్తుతం గలాట గీతూ హవా నడుస్తోంది. మూడు వారాలుగా గీతూ ఆట తీరుపై నాగార్జున ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నాడు. దీంతో గీతూ మరింత రెచ్చిపోయి..ఆటలో తన ప్రత్యేకతను చాటుకుంటుంది. అయితే అప్పుడప్పుడు ఆమె మాట్లాడే తీరు మాత్రం అటు హౌస్‌మేట్స్‌తో పాటు ఇటు ఆడియన్స్‌కి కూడా కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇదే విషయంపై నాగార్జున కాస్త సున్నితంగా ఆమెను హెచ్చరించాడు. కొన్నిమాటలు ఎదుటివాళ్లకు ఇబ్బందికరంగా ఉంటున్నాయని, వాటిని తగ్గించుకోవాలని సూచించాడు. ఇదిలా ఉంటే గీతూపై రేవంత్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ఆమెను ఎథిక్స్‌ లేవని, ఫ్యామిలీ వాల్యూ తెలియదని చెప్పాడు.  ఇదంతా శనివారం ఎపిసోడ్‌లో టెలికాస్ట్‌ అయింది.

(చదవండి: షాకింగ్‌ ఎలిమినేషన్‌: ఈవారం ఎవరు ఎలిమినేట్‌ అయ్యారంటే..)

బిగ్‌బాస్‌ జైలులో ఉన్న అర్జున్‌ దగ్గరికి వెళ్లిన రేవంత్‌.. గీతూ ప్రవర్తన గురించి మాట్లాడుతూ..‘కొంతమంది ఎమోషన్స్‌ని కూడా యాక్టింగ్ అంటున్నారు. వాళ్లకి ఫ్యామిలీ వాల్యూ తెలియదు. గీతు అంటుంది.. తల్లి ప్రేమ కంటే కుక్క ప్రేమ గొప్పదట. అసలు ఇలాంటి వాళ్లని ఎందుకు పిలిచారో.. ఇలాంటి వాళ్లు ఉన్న హౌస్‌లో నేను ఎందుకు ఉన్నానని సిగ్గుపడుతున్నా. అబ్బాయిలమైన మనకే కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. ఆ అమ్మాయికి ఎథిక్స్ లేవు. ఆమెను చూస్తుంటే..ఛీఛీ ఇలాంటి వాళ్లు ఉన్న హౌస్‌లోకి ఎందుకు వచ్చానో అనిపిస్తుంది. ఆమె గురించి బయట చాలా విన్నాను. ఎంతకైనా తెగిస్తుంది.

ఏమైనా చేస్తుందని విన్నా.. కానీ మరీ ఇంత దారుణంగా ప్రవర్తిస్తుందని తెలియదు. గీతూతో పోలిస్తే ఆదిరెడ్డి చాలా బెటర్‌. రివ్యూ సిస్టమ్ నుంచి బయటకు రావడంతో.. ప్రతిదీ తెలుసు అనుకుంటున్నారు. జనాలకు ఏం నచ్చుతుందో కూడా వీళ్లే చెప్పేస్తున్నారు.. వీళ్లేమైనా దేవుళ్లా? నాకు అర్ధం కావడం లేదు. వీళ్లని అసలు మనం కాంపిటేటర్స్‌లా లెక్కలోకి తీసుకోకూడదు’ అని రేవంత్‌ అన్నాడు. ఇక గీతూ కూడా రేవంత్‌కు నోటిదూల ఎక్కువని ఆదిరెడ్డి, అర్జున్‌లతో చెప్పుకొచ్చింది. అయితే నాగార్జున వీరిద్దరి నోటీదూల గురించి పరోక్షంగా, కాస్త వ్యంగ్యంగా హెచ్చరించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement