ఆదిరెడ్డి హత్యకేసు నిందితుల అరెస్టు | Adi Reddy murder accused arrested | Sakshi
Sakshi News home page

ఆదిరెడ్డి హత్యకేసు నిందితుల అరెస్టు

Published Mon, Dec 14 2015 1:02 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

Adi Reddy  murder accused arrested

ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఆరుగురు వ్యక్తులను నల్లగొండ జిల్లా పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పెద్ద ఊర మండల కేంద్రానికి చెందిన ఆదిరెడ్డి (49)ని భూతగాదాలు, పాత కక్షల నేపథ్యంలో ఈ నెల 7న కొందరు కారుతో యాక్సిడెంట్ చేసి.. కర్రలతో కొట్టి చంపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ అనంతరం.. హత్యకు పాల్పడిన ఆరుగురిని పెద్ద ఊర మండలం పొట్టిగానితండా వద్ద అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో నాగార్జునరెడ్డి, వెంకట్‌రెడ్డి, హర్షవర్దన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శశిధర్‌రెడ్డితోపాటు మరో వ్యక్తి ఉన్నాడు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement