ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీరాముడి భక్తులు భారీగా విరాళాలు అందించారు. ఆయల నిర్మాణం పూర్తిచేసుకుని రామమందిర ప్రాణ ప్రతిష్ఠకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. జనవరి 22న ఈ కార్యక్రమంగా ఘనంగా జరగనుంది. అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చి విరాళాలు సేకరించడం మొదలుపెట్టింది. దీంతో లక్షల మంది భక్తులు ముందుకు వచ్చారు.
తాజాగా ఇప్పుడు ఆ జాబితాలోకి బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి కూడా చేరాడు. మొదట బిగ్ బాస్ షో మీద రివ్యూలు చేస్తూ ఫేమస్ అయిన ఆదిరెడ్డి.. కామన్ మ్యాన్ కోటాలో బిగ్ బాస్-6లోకి ఎంట్రీ ఇచ్చి.. ఎవరూ ఊహించని విధంగా టాప్-5 వరకు చేరుకున్నాడు. ఆయన జీవితాన్ని బిగ్ బాస్ మార్చేసింది అంటూ ఆయన పలుమార్లు చెబుతూ ఉంటాడు కూడా.. తాజాగా 'శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర' ట్రస్ట్‌కు తన వంతుగా ఒక లక్ష రూపాయలు ఆయన విరాళం అందించాడు.
రామ మందిరం అనేది మనందరి కల, హిందువుల కల కాబట్టి తనవంతుగా ఉడుతా భక్తిగా ఈ విరాళం అందించానని ఆయన పేర్కొన్నాడు. అందరూ కూడా తమ వంతుగా డొనేట్ చేయాలని ఆయన చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు రామ మందిరానికి విరాళాల రూపంలో సుమారు రూ. 3,200 కోట్లు వచ్చినట్లు సమాచారం. బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాలలో ఈ డబ్బు జమ అయింది. దానిపై వచ్చిన వడ్డీతో ఇప్పటి వరకూ ఆలయ నిర్మాణం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment