ఇంకా లీడర్‌ అయ్యే ఛాన్స్‌ ఎక్కడ బేబక్క? టైం అయిపాయె! | Bigg Boss Telugu 8, September 7th Episode Review: Contestants First Week Report Card | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Telugu: బేబక్క అవుట్‌, ఈ వారం పర్ఫామెన్స్‌లో వాళ్లంతా ఫెయిల్‌!

Published Sat, Sep 7 2024 11:25 PM | Last Updated on Sun, Sep 8 2024 12:59 PM

Bigg Boss Telugu 8, September 7th Episode Review: Contestants First Week Report Card

మొన్నటిదాకా కూల్‌గా ఉన్న బేబక్క తన విశ్వరూపం చూపిస్తోంది. ఏదో పోనీలే అనుకుంటే అందరూ ఎక్కువ చేస్తున్నారని తన స్వరం పెంచింది. అయితే కిచెన్‌లో లేటుగా వంట చేయడం వల్ల లేనిపోని గొడవలకు కారణమవుతోంది. మరోవైపు తొలినాళ్లలో ఫైర్‌తో కనిపించిన నిఖిల్‌ కాస్తా చల్లబడిపోయాడు. ఇక ఈ వారం పర్ఫామెన్స్‌లో ఎక్కువ‌మంది లేడీస్‌ ఫెయిలయ్యారని తీర్పునిచ్చాడు నాగ్‌. ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి(సెప్టెంబర్‌ 7) ఎపిసోడ్‌ హైలైట్స్‌ చదివేయండి..

ఆమె మీద కోపం అతడిపై..
ఎప్పటిలాగే కిచెన్‌లో గొడవ మొదలైంది. బేబక్క.. 'సోనియా.. నన్ను పర్సనల్‌ అటాక్‌ చేస్తోంది. తనతో వైబ్‌ రావట్లేద చెప్తుంటే కూడా పట్టించుకోవట్లేదేంటి?' అని తన టీమ్‌ లీడర్‌ నిఖిల్‌ మీద ఫైర్‌ అయింది. సోనియా అయినా ముఖం మీద మాట్లాడుతుంది కానీ నువ్వు మాస్క్‌ వేసుకుని ఉన్నావంటూ అతడిపై నిందలు వేసింది. అయితే సోనియా మీద కోపం నిఖిల్‌ మీద చూపించినట్లు అనిపించింది.

అడల్ట్‌ కామెడీ..
మరోవైపు విష్ణుప్రియ.. మొదట్లో నీకు నిఖిల్‌తో పడలేదుగా, మరి ఇప్పుడెలా స్నేహం కుదిరిందని అడిగింది. ఈ ప్రశ్న నచ్చకపోవడంతో సోనియా.. అడల్ట్‌ జోకులు నాపై వేయొద్దని ఫైర్‌ అయింది. ఆ మాటతో చిర్రెత్తిన విష్ణుప్రియ మీ మధ్య ఏదో ఉందని అనలేదుగా.. దానికి అంత మాట అనాల్సిన అవసరం లేదని తిట్టిపోసింది. దీంతో సోనియా ఏడ్చేసింది. అయినా విష్ణుప్రియ వల్లేదు. నన్ను ఆ మాట ఎలా అంటావ్‌? నువ్వు ఒక్కదానివే పుణ్య స్త్రీ.. మేము మాత్రం ఇలాంటివాళ్లమా? అని చిర్రుబుర్రులాడింది. ఇవన్నీ శుక్రవారం జరిగాయి.

కత్తి దింపిన కంటెస్టెంట్లు
శనివారం నాడు.. నాగార్జున వచ్చీరాగానే వినాయక చవితి సందర్భంగా ఇంట్లో అందరికీ స్వీట్లు పంపించాడు. అలాగే ఓ టాస్క్‌ ఇచ్చాడు. మాటలతో గాయపర్చేవారిని చురకత్తితో, నెగెటివ్‌ అనిపించినవారిని నల్లకత్తితో, రెండునాలుకలు ఉన్నవారిని ఇరువైపులా పదునున్న కత్తితో, చలనం లేకుండా పడి ఉన్న కంటెస్టెంట్లను తుప్పుకత్తితో పొడవాలన్నాడు. మొదటగా బాషా.. మణికంఠలో నెగెటివ్‌ ఎనర్జీ చూస్తున్నానంటూ అతడు ధరించిన దిండుపై నల్లకత్తితో పొడిచాడు.

నిఖిల్‌ టీమ్‌ నుంచి బయటకు
విష్ణుప్రియ.. అడల్ట్రేటెడ్‌ కామెడీ చేస్తున్నానంటూ సోనియా తనపై మాటలు జారిందని చురకత్తితో పొడిచింది.  ఈ విషయంలో నాగ్‌ సోనియాకే సపోర్ట్‌ ఇవ్వడం గమనార్హం. విష్ణు.. సోనియాను పుణ్య స్త్రీ అంటూ వెక్కిరించి మాట్లాడటాన్ని తప్పుపట్టాడు. నైనిక.. తన టీమ్‌తో ఎక్కువ పని చేయించిందంటూ యష్మిని చురకత్తితో పొడిచింది. బేబక్క.. నిఖిల్‌ తన టీమ్‌లో ఉన్న నాకు బదులుగా సోనియాను ఎక్కువ పట్టించుకున్నాడంటూ అడిని పదును కత్తితో పొడిచింది. 

మారిపోయిన నిఖిల్‌
అలాగే అతడితో ఉండటం ఇష్టం లేదంటూ టీమ్‌ నుంచి బయటకు వచ్చేసింది. అభయ్‌.. నిఖిల్‌ను మాస్క్‌ తీసే కత్తితో పొడిచాడు. మొదట్లో అగ్రెసివ్‌గా ఉన్న నిఖిల్‌ ఇప్పుడు ఎవరితో ఏం మాట్లాడితే ఎలా ఫీల్‌ అవుతారోనన్న భయంలో పడిపోయాడు. అవన్నీ అవసరం లేదు, మొదట్లో ఎలా ఉన్నావో అలా ఉంటే చాలని సూచించాడు.

వెగటు కామెడీ
నెగెటివ్‌ ఎనర్జీ అన్న కారణంతో సీత.. యష్మిని, సోనియా.. బేబక్కను నల్లకత్తితో పొడిచారు. నబీల్‌.. నిఖిల్‌ వెగటు కామెడీ నచ్చలేదని అతడిని చురకత్తితో పొడిచాడు. ప్రేరణ, పృథ్వి.. ఆదిత్య ఓంకు తుప్పు పట్టిన కత్తి దింపారు. మణికంఠ, యష్మి ఒకరినొకరు పదునుకత్తితో పొడుచుకున్నారు. నిఖిల్‌ వంతురాగా.. రెండు నాలుకలు ఉన్నాయంటూ బేబక్కను పదును కత్తితో పొడిచాడు. ఆదిత్య.. బాషాను తుప్పు పట్టిన కత్తితో పొడిచాడు.

ఆ ఐదుగురు ఫ్లాప్‌
అనంతరం నాగ్‌.. ఈ వారం కంటెస్టెంట్ల రిపోర్టు కార్డును బయటపెట్టాడు. పర్ఫార్మెన్స్‌ ఆధారంగా చూస్తే ప్రేరణ, సీత, బేబక్క, ఆదిత్య, విష్ణుప్రియ ఫ్లాప్‌ అయ్యారని తెలిపాడు. చివర్లో సోనియా సేవ్‌ అయినట్లు వెల్లడించాడు. ఇక సండే ఎపిసోడ్‌ షూట్‌ పూర్తవగా బేబక్కను ఎలిమినేట్‌ చేశారట! పాపం.. ఇది ముందు గ్రహించలేకపోయిన ఆమె తనే లీడర‌ను అవుతానని శపథం చేసింది. ఇంతలోనే ఇల్లు వదిలి బయటకు వెళ్లాల్సి వచ్చింది.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement