
శేఖర్ బాషాకు బిగ్‌బాస్ ఒక గుడ్‌న్యూస్ చెప్పాడు. ఒక బ్యాడ్‌న్యూస్ రేపు సడన్‌గా రివీల్ చేయనున్నాడు.. తనకు బాబు పుట్టాడన్నది శుభవార్త అయితే... ఈ వారం తనే ఎలిమినేట్ కానున్నాడనేది బ్యాడ్‌న్యూస్. నిండు గర్భవతిని వదిలి బిగ్‌బాస్‌కు వచ్చిన బాషా.. తాను తండ్రినయ్యానన్న విషయం తెలిసి ఎమోషనలయ్యాడు.
మరోవైపు సోనియా.. విష్ణుపప్రియ విషయంలో నోరు జారిన విషయాన్ని ప్రస్తావించాడు. నీకంటూ పట్టించుకునేవాళ్లు ఎవరూ లేరేమో.. నాకు ఫ్యామిలీ ఉంది. మమ్మల్ని పట్టించుకునేవాళ్లున్నారు అని విష్ణుప్రియ బాధపడేలా మాట్లాడింది. ఈ వీడియో ప్లే చేసిన నాగ్.. అలా మాట్లాడటం కరెక్టేనా? మాట అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం అని సోనియాను హెచ్చరించాడు.
చదవండి: ఆ ముగ్గురిలో అతడే ఎలిమినేట్! బిగ్‌బాస్ ప్లాన్ ప్రకారమే జరిగిందా?
Comments
Please login to add a commentAdd a comment