ఆడపులి.. అసలు దీనికి అర్థం తెలుసా? అందులోని లక్షణాలేమైనా సోనియాకు ఉన్నాయా? పెద్దగా అరిస్తే చాలు, అందరూ తోకముడుచుకుని తనకు భయపడుతారనుకుంటుందేమో మరి! బహుశా జనాలెలాగో తనను ఆడపులిగా గుర్తించరని తనకు తానే ఈ ట్యాగ్ వేసుకుందేమో!
విష్ణుప్రియను ఆడుకున్నావ్, మరి ఇదేంటో?
పోనీ ఆ తోక తగిలించుకున్నందుకైనా ఆ పేరుకు న్యాయం చేస్తుందా? అంటే అదీ లేదు! పైగా రోజురోజుకీ తన ప్రవర్తనతో అందరితో ఛీ కొట్టించుకుంటోంది. మీకు గుర్తుందిగా.. నిఖిల్‌తో స్నేహం ఎలా బలపడింది? అని విష్ణుప్రియ అడిగినందుకు ఆమెను రాచిరంపాన పెట్టింది. నీకు కుటుంబం లేదేమో కానీ నాకు ఉంది, వాళ్లు ఇలాంటి ప్రశ్నలు వింటే ఏమనుకుంటారు? ఎంత బాధపడతారు? అని నానా రాద్దాంతం చేసింది.
ఆ ముగ్గురికీ హగ్గుల దాత
కట్ చేస్తే ఒక్క నిఖిల్ ఏం కర్మ? పృథ్వీ, అభయ్‌లకు సైతం నిత్య హగ్గులు పంచుతోంది. స్నేహం అన్న పదానికే అర్థాలు మార్చేస్తోంది. వాళ్లతో కూర్చున్నప్పుడు తన చేతులు ఆమె ఆధీనంలోనే ఉండట్లేదు. గడ్డం నిమరడమో, కాళ్లపై చేయి వేయడమో, చేతులో చేయేసి పట్టుకోవడమో.. ఇదే తంతు.. బిగ్‌బాస్ లైవ్ చూసేవారికైతే ఈమె ప్రవర్తన చూసి తల బొప్పి కడుతోంది.
హౌస్‌లో చెండాలం పని
ఇవన్నీ చాలదన్నట్లు ఈసారి ఇంకాస్త రెచ్చిపోయింది. నిఖిల్‌ను అసభ్యంగా తాకింది. అందుకు అతడు కూడా ఏమీ అభ్యంతరం తెలపకుండా వెంటనే హగ్ చేసుకోవడం గమనార్హం. ఈ విషయంపై సోషల్ మీడియాలో సోనియాను నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
ఎలిమినేట్ చేయండి మహాప్రభో
'ఆమె స్థానంలో ఒక అబ్బాయి ఉంటే మాత్రం రెడ్ కార్డ్ ఇచ్చి వెంటనే హౌస్ నుంచి పంపించేసేవారు. అదే ఈ సోనియాకు కనీసం గడ్డి పెట్టేవాళ్లు కూడా లేరు', 'హౌస్‌లో ఇలాంటి పిచ్చి చేష్టలకు చెక్ పెట్టకపోతే బిగ్‌బాస్ షో ఫ్యామిలీతో కలిసి చూడటం కష్టమే', 'తనను ఎలిమినేట్ చేయండ్రా బాబూ' అని నెటిజన్లు బిగ్‌బాస్‌కు మొర పెట్టుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment