Bigg Boss 8: అమ్మ రాకతో నబీల్ ఫుల్ హ్యాపీ.. బాధతో తేజ కన్నీళ్లు | Bigg Boss 8 Telugu Day 72 Episode Highlights Family Week | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Day 72 Highlights: గడ్డం గురించి యష్మి-నిఖిల్ సోది ముచ్చట్లు

Published Wed, Nov 13 2024 9:02 AM | Last Updated on Wed, Nov 13 2024 9:12 AM

Bigg Boss 8 Telugu Day 72 Episode Highlights Family Week

ఈ వారం నామినేషన్ ఒక్కరోజులోనే పూర్తయ్యాయి. గౌతమ్‌, తేజ, పృథ్వీ, అవినాష్‌, విష్ణుప్రియ, యష్మీ నామినేట్ అయ్యారు. ప్రతి సీజన్‌లో మిగతా ఎపిసోడ్స్ గురించి జనాలు ఎంత తిట్టుకున్నా సర 'ఫ్యామిలీ వీక్' వస్తే మాత్రం తప్పకుండా చూస్తారు. ఈ వారం అదే జరగనుంది. తల్లి రాకతో నబీల్ ఫుల్ హ్యాపీగా ఫీలవగా.. తేజ మాత్రం కన్నీళ్లు పెట్టుకున్నాడు. గడ్డం గురించి నిఖిల్-యష్మీ సోదిలో ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇంతకీ మంగళవారం (నవంబర్ 12) ఎపిసోడ్‌లో అసలేం జరిగిందనేది చూద్దాం.

(ఇదీ చదవండి: ఎన్నికల ప్రచారంలో ప్రముఖ నటుడికి చేదు అనుభవం)

స్వీట్ రూల్ బ్రేక్
గతంలో హౌస్‌మేట్స్ కోసం వారంరోజుల పాటు అన్‌లిమిటెడ్ ఫుడ్ అందించేందుకు నబీల్.. సీజన్ అంతా స్వీట్స్ తిననని త్యాగం చేశాడు. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేసిన బిగ్‪‌బాస్.. యాక్షన్ రూంకి రమ్మని పిలిచి హల్వా ఇచ్చాడు. ఇది జరిగిన కాసేపటికి మరోసారి యాక్షన్ రూంకి పిలిచి ప్లేటులో స్వీట్స్ పెట్టాడు. ఇవి తింటుండగానే ఇతడి తల్లి నజ్మా నూష్రత్ హౌసులోకి వచ్చారు.

నీ ఆట నువ్వు ఆడాలి
హౌసులోకి వచ్చిన తర్వాత అందరూ నబీల్ తల్లిని పలకరించారు. ఆ తర్వాత నబీల్-అతడి తల్లి కూర్చుని మాట్లాడుకున్నారు. ఎలా ఆడుతున్నా, టీవీలో కనిపిస్తున్నానా లేదా అని నబీల్.. తన గేమ్ గురించి తల్లిని అడిగాడు. నబీల్ అడిగితే బాగా ఆడుతున్నావ్, ఇండివిడ్యువల్‌‌గా అట్లనే ఆడు, ఎమోషనల్ కావద్దు, నీ ఆట నువ్వు ఆడు.. ఎవరి గురించీ పట్టించుకోవద్దు.. ఎవరో ఏదో అన్నారని ఏం ఫీల్ కాకు.. అందరితో మంచిగానే ఉండు అని విలువైన సూచనలు ఇచ్చారు.

(ఇదీ చదవండి: రోహిణికి సర్‌ప్రైజ్‌ ఇచ్చిన బిగ్‌బాస్.. కన్నీళ్లు పెట్టుకున్న టేస్టీ తేజ!)

నబీల్ కోసం గేమ్
ఇంతలో నబీల్ తల్లి బయటకు వెళ్లాల్సిన టైమ్ వచ్చిందని బిగ్‌బాస్ నుంచి అనౌన్స్‌మెంట్ వచ్చింది. కాకపోతే మీరు బయటకెళ్లేముందు మీ అబ్బాయి కోసం ఓ గేమ్ ఆడాలని చెప్పి.. టేబుల్ ముందున్న ఓ డిస్క్‌ విసరమని చెప్పాడు. అది ఓ చోట ఆగడంతో ఎన్వలప్ కవర్‌లో ఏముందా అని చూడగా.. అమ్మ చేతి గులాబ్ జామున్ 20 పీస్ అని రాసుంది. దీంతో ఆ స్వీట్లని తీసుకున్న నబీల్.. హౌస్‌మేట్స్ అందరికీ ఇచ్చాడు. వెళ్లేముందు 'మనం' మూవీలోని 'కనిపించిన మా అమ్మకి..' పాట ప్లే చేయగా.. అందరూ కలిసి డ్యాన్స్ చేసి నబీల్ తల్లికి టాటా చెప్పేశారు. తల్లి వెళ్లిపోవడంతో నబీల్ కాస్త ఎమోషనల్ అయ్యాడు.

గడ్డం గురించి డిస్కషన్
నబీల్ తల్లి వెళ్లిపోయిన తర్వాత నిఖిల్ ఒంటరిగా కూర్చుని ఉంటే.. యష్మీ టీజ్ చేసింది. గడ్డం గురించి మాట్లాడుతూ.. మంచి గడ్డం వద్దురా వద్దురా అంటే అస్సలు విన్నాడా అని నిఖిల్ గురించి పృథ్వీకి చెప్పింది. దీంతో నువ్వు (నిఖిల్) గడ్డం పెంచుకోరా అని నిఖిల్ అన్నాడు. అవును నువ్వు తీసేసి రెడ్ ఫ్లాగ్ అయ్యావ్ అని నిఖిల్‌ని పరోక్షంగా కౌంటర్ వేసింది. హౌస్‌లో గడ్డం ఉన్నవాడివి నువ్వు (పృథ్వీ) ఒక్కడివే.. ఆ గడ్డానికి పడిపోయా నేను.. అని పృథ్వీతో యష్మి ఫ్లర్ట్ చేసింది. ఇది విని నవ్వేసిన నిఖిల్.. ఈ డైలాగ్ వింటే 'విష్ణు ఏం చేస్తది తెలుసా.. నైట్‌కి నైట్ నిన్ను చంపేస్తాది' అని యష్మిని ఆటపట్టించాడు.

(ఇదీ చదవండి: అక్కినేని ఇంట పెళ్లిసందడి.. ఆ విషయంలో సెంటిమెంట్‌!)

తేజ ఏడ్చేశాడు
నబీల్ తల్లి వచ్చి వెళ్లిన తర్వాత తన తల్లిని గుర్తుచేసుకుని తేజ తెగ బాధపడ్డాడు. అందరి పేరెంట్స్ వస్తారు, కానీ నా కోసం మాత్రం రారు.. ప్లీజ్ బిగ్‌బాస్.. నేను ఏడిస్తే మా అమ్మకి నచ్చదు.. కానీ అమ్మ కోసం ఏడుస్తా అనుకోలేదు బిగ్‌బాస్.. ఇంకా కష్టపడి ఆడతా బిగ్‌బాస్ ప్లీజ్.. ఇంత పెద్ద పనిష్మెంట్ నాకు ఇవ్వొద్దు.. మీరు ఏదంటే అదే.. నాకు ఇంతకంటే పెద్ద పనిష్మెంట్ ఏం ఉండదు.. కావాలంటే ఎవ్రీ వీక్ డైరెక్ట్ నామినేషన్ అవుతా అని తనలో తానే అనుకుంటూ తేజ ఏడ్చాడు.

ఇక కాసేపటి తర్వాత అవినాష్ దగ్గర నిఖిల్ ఓపెన్ అయ్యాడు. నాకు తేజదే గిల్ట్ అవుతుంది.. నాకేం తెలుసురా అలా అవుతుందని.. ఇప్పుడు మా అమ్మ వచ్చినా నేను అంత హ్యాపీగా ఫీల్ అవ్వలేను అని నిఖిల్ అన్నాడు. దీని తర్వాత ఫ్రీజ్-రిలీజ్ అనే గేమ్‌ని బిగ్‍‌బాస్ పెట్టాడు. మిగతా వాళ్ల సంగతేమో గానీ విష్ణుప్రియ, పృథ్వీ దగ్గరికి రాగానే పలుమార్లు ఫ్రీజ్ చేశాడు. దీంతో విష్ణు.. పృథ్వీ మీద వాలిపోయి తెగ ఫీలైపోయింది. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది.

(ఇదీ చదవండి: 'మిస్టర్ బచ్చన్'.. నేను తీసుకున్న చెత్త నిర్ణయం!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement