
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్. పుట్టిపెరిగిందంతా వరంగల్‌లోనే! చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే పిచ్చి. ఆడిషన్స్‌కు తీసుకెళ్లు అని తండ్రిని విసిగించాడు. ఇతడి పోరు పడలేక సరే, నీకు నచ్చింది చేసుకో అన్నాడు. తండ్రి అనుమతి దొరకడంతో ర్యాప్ సాంగ్స్, షార్ట్ ఫిలింస్ చేశాడు. కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఏం చేయాలో తోచలేదు. మనపై మనమే కుళ్లు జోకులు చేసుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచన తన జీవితాన్ని మార్చేసింది.
అవకాశాల కోసం ఎవరినో అడగడమెందుకు? మనమే అవకాశం సృష్టించుకోవాలని ప్రయత్నించాడు. అలా వరంగల్ డైరీస్ యూట్యూబ్ ఛానల్‌తో స్టార్ అయిపోయాడు. లక్షలు సంపాదించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు బిగ్‌బాస్ ఛాన్స్ రావడంతో సంతోషంగా ఓకే చెప్పాడు. అలా బిగ్‌బాస్ 8లో పద్నాలుగో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు. ఫినాలేలో అడుగుపెట్టిన నబీల్ టాప్ 3లో(సెకండ్ రన్నరప్‌గా) ఉండగా ఎలిమినేట్ అయ్యాడు.