![Bigg BOss Fame Avinash Shares His Engagement Video Goes Viral - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/6/avinash.jpg.webp?itok=dfo7U-dw)
Mukku Avinash Engagement Video: బుల్లితెర షోలపై తనదైన కామెడీతో సందడి చేస్తూ కెరీర్ పరంగా దూసుకెళ్తున్న ముక్కు అవినాష్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల అనుజ అనే అమ్మాయితో అవినాష్ నిశ్చితార్థం జరిగింది. గత బిగ్‌బాస్ సీజన్ 4లో పెళ్లి పెళ్లి అంటూ కలవరించిన అవినాష్ ఇలా గుట్టు చప్పుడుగా ఎంగేజ్‌మెంట్ చేసుకోవడంతో అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఏదేమైతేనే పెళ్లి పెళ్లి అంటూ తహతహలాడిన అవినాష్ ఎట్టకేలకు వివాహం చేసుకోబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ సంతోషించారు.
చదవండి: ఈ వారం థియేటర్లో, ఓటీటీలో అలరించబోతోన్న చిత్రాలివే!
అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో కానీ, ఫుల్ ఫొటోలు కానీ ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా అవినాష్ తన ఎంగేజ్‌మెంట్ వీడియోను విడుదల చేశాడు. ‘జత కలిసే’ అంటూ నిశ్చితార్థం వీడియోను సోషల్ మీడియా వేదికగా అవినాష్ అభిమానులతో పంచుకున్నాడు. పూలు పండ్లు మార్చుకోవడం, ఆ తర్వాత అనుజతో అవినాష్ ఫొటో షూట్ చేయడం, కాబోయే శ్రీమతికి రొమాంటిక్‌గా ముద్దు పెట్టుకొని డ్యాన్స్ చేయడం వంటి సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. దీంతో అవినాష్ ఎంగేజ్‌మెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment