బిగ్‌బాస్‌ : కామెడీ ఆపేస్తే బాగుంటుంది.. అభిజిత్‌ ఫైర్‌ | Bigg Boss 4 Telugu : 9th Week Nomination Process Started | Sakshi
Sakshi News home page

తెరపైకి ‘చిల్లర కామెడీ’.. అభి తలపై కోడి గుడ్ల మోత

Published Mon, Nov 2 2020 11:23 PM | Last Updated on Tue, Nov 3 2020 9:34 AM

Bigg Boss 4 Telugu : 9th Week Nomination Process Started - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో తొమ్మిదో వారానికి జరిగిన నామినేషన్ల ప్రక్రియ ప్రకంపనాలు సృష్టించింది. హౌస్‌మేట్స్‌ మధ్య మాటల యుద్దం తారాస్థాయి చేరింది. అయితే ఈ వారం నామినేషన్‌ ప్రక్రియ గత వారాలకంటే కాస్త విరుద్ధంగా జరిగింది. ప్రతి వారం ఒక్క ఎపిసోడ్‌లోనే నామినేషన్‌ ప్రక్రియ పూర్తయ్యేది. కానీ ఈ వారం మాత్రం అది రెండు ఎపిసోడ్లకు చేరింది. ఇక రోజు జరిగిన నామినేషన్‌ ప్రక్రియలో కోడిగుడ్ల మోత మోగింది. చుక్కలు చూపిపించిన కెప్టెన్‌ అరియానా, అవినాష్‌, అభిజిత్‌ మధ్య చిచ్చు రేపిన నోయల్‌ వ్యాఖ్యలు, గుడ్డు కొట్టొదని మోనాల్‌ ఏడుపులు.. ఇంకా ఈ రోజు ఎపిసోడ్‌లో ఏమేం జరిగాయో చదివేయండి.

టామ్‌ అండ్‌ జెర్రీ లొల్లి
అఖిల్‌కి ఏమైందో ఏమో కానీ మోనాల్‌తో కాస్త దూరంగా ఉన్నాడు. దీంతో మోనాల్‌ అఖిల్‌ దగ్గరికి వచ్చి ఏమైంది.. ఎందుకు దూరంగా ఉంటున్నావు అని అడిగితే.. అదేం లేదు అన్నట్లు అఖిల్‌ చెప్పుకొచ్చాడు. హగ్ ఇవ్వు అయితే అని మోనాల్‌ అడగ్గా.. అఖిల్ మనస్పూర్తిగా కౌగిలించుకోలేదు. దీంతో మనసు చిన్నబుచ్చుకున్న మోనాల్‌ ‘ నా అఖిల్ అయితే ఇలా కౌగిలించుకోడు’ అంటూ బుగ్గమూతి పెట్టింది. నీకు స్పేస్ కావాలా?? ఏమైంది నీకు.. నాకు అఖిల్ గురించి నాకు తెలుసు.. ఏమైంది అని మోనాల్ అడిగితే... నాకు కొంత టైం కావాలి’ అంటూ ఎప్పటిలాగే తనదైన శైలిలో చెప్పేశాడు అఖిల్‌. 

ఇక ఉదయం 11 గంటలు అయినా మెహబూబ్‌, సోహైల్‌ నిద్ర పోయారు. దీంతో హౌస్‌లో కుక్కలు మోరిగాయి. ఇక్కేముంది కెప్టెన్‌ అరియానా వచ్చి పనిష్మెంట్‌ ఇచ్చారు. స్నానం చేయాలని సూచించింది. అయితే ఇక్కడ సోహైల్‌ తెలివిగా తప్పించుకున్నాడు. నేను నిద్రపోలేదని, మెహబూబ్‌ మాత్రమే నిద్రపోయాడని చెప్పుకొచ్చాడు. దీంతో మెహబూబ్‌ మాత్రమే పనిష్మెంట్‌ కింద స్నానం చేశాడు. ఇళ్లు ఊడ్చే విషయంతో అరియానా, మెహబూబ్‌కు మధ్య వాదన జరిగింది. ప్రతి సారి నన్నే టార్గెట్‌ చేస్తున్నావంటూ కెప్టెన్‌ అరియానాపై మెహబూబ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరోవైపు గార్డెన్‌ ఏరియాలో కూర్చున్న లాస్య, అభిజిత్‌..నామినేషన్లు ఎలా ఉండబోతున్నాయో జోస్యం చేప్పారు. 

నేను గిట్లనే ఉంటా : సోహైల్‌
మరోసారి సోహైల్‌ నిద్ర పోవడంతో అరియానా వచ్చి పనిష్మెంట్‌ కింద స్నానం చేయాల్సిందిగా సూచించింది. అయితే తాను కాసేపటి క్రితమే స్నానం చేశానని, సాయంత్రం చేస్తానని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ అరియానా మాత్రం 15 నిమిషాల్లో స్నానం చేయాలని కోరింది. దీంతో కోపోద్రిక్తుడైనా సోహైల్‌.. పరుగునా వచ్చి స్విమ్మింగ్‌పూల్‌లో దూకేశాడు. తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పిన వినిపించుకోకుండా స్నానం చేయమని చెప్పడం ఏంటి. కెప్టెన్‌ అయినంత మాత్రనా ఏది చెబితే అది చేయాలా అంటూ..స్విమ్మింగ్‌పూల్‌లోనే జలదీక్ష చేపట్టాడు. మెహబూబ్‌, అవినాష్‌ వచ్చి ఎంత నచ్చజెప్పినా పూల్‌లో నుంచి బయటకు రాలేదు. చివరకు అమ్మరాజశేఖర్‌ మాస్టర్‌, అవినాష్‌, మెహబూబ్‌ బ్రతిమిలాడడంతో తడి దుస్తులతో ఇంట్లోకి వెళ్లాడు. దుస్తులు మార్చుకోవాలని ఇంటి సభ్యులు చెప్పినా.. పట్టించుకోకుండా నేను గిట్లనే ఉంటా. ఏం చేస్తారో చూస్తా అంటూ తడి దుస్తులతో భీష్మించుకు కూర్చున్నాడు. దీంతో అఖిల్‌ కలగజేసుకొని ఆయన్ని అలాగే వదిలేయండి అంటూ అవినాష్‌, మెహబూబ్‌లను పక్కకు తీసుకెళ్లాడు. దీంతో మరింత రెచ్చిపోయిన సోహైల్‌.. ఏంటి అఖిల్‌..నీకేం తెలుసు నా బాధ అంటూ ఫైర్‌ అయ్యాడు. బ్రతిమిలాడినకొద్ది నువ్వు ఎక్కువ చేస్తున్నావు. హౌస్‌మేట్స్‌తో ఇలాగేనా మాట్లాడేది అని అఖిల్‌ సోహైల్‌పై ఆగ్రహం​వ్యక్తం చేశాడు. అనంతరం బెడ్‌పై కూర్చోబెట్టుకొని అలా మాట్లాడడం సరికాదని సూచించాడు. అయితే సోహైల్‌ మాత్రం ఎవరి మాటవినకుండా అరియానాపై అరుస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో సోహైల్‌ మైక్‌ మర్చిపోయాడు. దీంతో బిగ్‌బాస్‌ మైక్‌ ధరించాలని సోహైల్‌కి సూచించాడు. ఇక మరోసారి క్రమశిక్షణ తప్పావంటూ.. అరియానా వచ్చి పనిష్మెంట్‌ కింద బిగ్‌బాస్‌కు క్షమాపణ చెప్పాలని కోరింది. కానీ సోహైల్‌ ఆ పనిచేయనని కరాఖండిగా చెప్పేశాడు. 

షూ లేస్‌ ఇవ్వకుంటే పనిష్మెంట్‌ ఇస్తా
ఇక డే మొత్తం అరియానాపై చిందులేసిన సోహైల్‌.. సాయంత్రం సమయంలో ఆమెను కూల్‌ చేసే పనిలో పడ్డాడు. తన షూ లేస్‌ ఎక్కడ పెట్టావో చెప్పాలని అరియానాను అడిగాడు. అయితే తాను గత రెండు వారాల క్రితం తీసుకొని మళ్లీ ఇచ్చానని అరియానా చెప్పుకొచ్చింది. అయితే తనకు లేస్‌ ఇవ్వలేదని, అవి పోగొట్టిన కారణంగా పనిష్మెంట్‌ ఇస్తా అని సోహైల్‌ గొడవకు దిగాడు.  దీంతో పనిష్మెంట్ ఏంటి అని అడిగింది అరియానా. ఆలోచించుకొని చెప్తా అంటూ.. వెళ్లిపోయాడు. ఆ తరువాత నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ కావడంతో ఈ ఇద్దరి మధ్య రచ్చ మరింత రెట్టింపు అయ్యింది.

నామినేషన్‌ ప్రక్రియ షురూ.. మోతమోగిన కోడి గుడ్లు
అయితే ఎప్పటిలా అందరికీ ఒకేసారి కాకుండా.. బిగ్ బాస్ అనౌన్స్ మెంట్ వచ్చినప్పుడు బిగ్ బాస్ ఎవరి పేరు చెప్తారో వాళ్లు వెళ్లి ఇద్దరి తలపై కోడు గుడ్లు పగలకొట్టాల్సి ఉంటుందని చెప్పారు. అయితే ఎగ్అంటే నాకు పడదని.. నా తలపై పగలగొట్టించుకోనానని బిగ్ బాస్‌కి రిక్వెస్ట్ చేసింది మొనాల్.. ఎలాగూ నామినేట్ అయినా బిగ్ బాస్ సేవ్ చేస్తూ ఉంటారు.. ఇక ఈ గుడ్డు కొట్టించుకోవడం నామినేషన్ అవసరమా బిగ్ బాస్ అనుకుందో ఏమో కానీ.. దీని నుంచి మినహాయింపు ఇవ్వాలని బిగ్ బాస్‌‌ని ఏడుస్తూ రిక్వెస్ట్ చేసింది అతని దత్త పుత్రిక మోనాల్. అయితే మోనాల్ అడగాలే కాని బిగ్ బాస్ కాదంటారా.. మీకు బదులుగా మీరు నామినేట్ చేసేవాళ్ల తలపై పగల గొట్టాలని కోరవచ్చని చెప్పారు.

ఈ సారి నామినేషన్‌ ప్రక్రియను కాస్త భిన్నంగా తిర్చిదిద్దాడు బిగ్‌బాస్‌. ఎప్పటిలాగా అందరిని ఒకేసారి కాకుండా.. బిగ్ బాస్ అనౌన్స్ మెంట్ వచ్చినప్పుడు బిగ్ బాస్ ఎవరి పేరు చెప్తారో వాళ్లు వెళ్లి ఇద్దరి తలపై కోడు గుడ్లు పగలకొట్టి నామినేట్‌కు గల కారణాలు చెప్పాల్సి ఉంటుందని చెప్పాడు. అయితే తనకు కోడు గుడ్‌ వాసన పడదని, తన తలపై ఎగ్‌ పగలగొట్టకుండా చూడాలని మోనాల్‌ బిగ్‌బాస్‌ని రిక్వెస్ట్‌ చేసింది. దీంతో ఈ ప్రక్రియ నుంచి ఆమెకు మినాహాయింపు ఇస్తూ.. ఆమె నామినేట్‌ చేసేవాళ్ల తలపై వెరేవాళ్లు కోడి గుడ్లను పగలగొట్టవచ్చని అవకాశం ఇచ్చాడు. 

పెద్ద పుడింగిలా పీల్‌ అవ్వకు అరియానా : సోహైల్‌
మొదటిగా కెప్టెన్ అరియానాకి బిగ్ బాస్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఆమె మొదటి గుడ్డుని హారిక తలపై పగలగొడుతూ.. రాక్షసుల టాస్క్‌లో ఆమె ప్రవర్తన నచ్చలేదని చెప్పింది. రెండో గుడ్డుని అందరూ ఊహించినట్లే తన చిలిపి శత్రువు సొహైల్ తలపై కొట్టింది. నేను స్ట్రిక్ట్‌గా కెప్టెన్సీ చేయాలని అనుకున్నా.. కానీ నువ్ మార్నింగ్ నేను పనిష్మెంట్ ఇచ్చినా నువ్ చేయను అని అన్నావ్ అందుకే నిన్ను నామినేట్ చేశా.. అని చెప్పింది. దీంతో సోహైల్‌ మరోసారి రెచ్చిపోయాడు. ‘ఇప్పటి వరకూ 8 మంది కెప్టెన్లు అయ్యారు.. నేనూ అయ్యా.. నీలా ఎవరూ చేయలేదు.. నీ యాటిట్యూడ్ చూపించకు.. నువ్ పెద్ద పుడింగిలా ఫీల్ అయిపోకు. గలీజ్‌ రీజన్‌ చెప్పి నామినేట్‌ చేయకు. కెప్టెన్‌ అయినంత మాత్రనా ఏది చెబితే అది చేయ్యం. నీ ప్రతాపం అంతా నామీద, మెహబూబ్‌ మీదే చూపిస్తావు. ఇది గలీజ్‌ నామినేషన్’ అంటూ అరియానాపై చిందులు వేశాడు సోహైల్‌.

తెరపైకి చిల్లర కామెడీ.. అవినాష్‌-అభిల మధ్య మాటల యుద్దం
ఇక రెండో అవకాశం అవినాష్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. దీంతో అవినాష్‌ తన మొదటి గుడ్డుని అభిజిత్‌పై కొట్టాడు. నోయల్ చిల్లర కామెడీ అని అన్నప్పుడు నువ్వు లేచి సీరియస్ అవ్వడం నాకు నచ్చలేదు. నోయల్ పర్సనల్‌గా నన్ను టార్గెట్ చేసినప్పుడు మీరు మధ్యలో జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదని చెప్పాడు అవినాష్. ఇక రెండో గుడ్డును హారిక తలపై పగలగొట్టాడు. కేర్‌టేకర్‌ టాస్క్‌లో సరైన ఫర్మార్మెన్స్‌ ఇవ్వలేదని, టాస్క్‌ చేయకుండా నీకు ఇష్టమైన వాళ్ల దగ్గరు వెళ్లి కూర్చున్నావని చెబుతూ హారికను నామినేట్ చేశాడు.

ఆ తరువాత సొహైల్ వంతు రావడంతో.. నాకు అరియానాని నామినేట్ చేయాలని ఉంది కానీ.. ఆమె కెప్టెన్ కావడంతో చేయట్లేదు. ఆమె నెక్స్ట్ వీక్ ఉంటే చేస్తా అని చెప్పి. మొదటి గుడ్డును మోనాల్ తలపై పగలగొట్టాడు. నువ్ ఇక్కడ విషయం అక్కడ అక్కడ విషయం ఇక్కడ చెప్పడం వల్ల అఖిల్‌కి నాకు మధ్య మనస్పర్థలు వస్తున్నాయని.. అంతేకాకుండా టాస్క్‌లలో బాగా ఆడటం లేదని అందుకే నామినేట్ చేస్తున్నానని మోనాల్‌‌తో చెప్పాడు సొహైల్. కేర్‌టేకర్‌ టాస్క్‌ ఇంకా బాగా ఆడితే బాగుండేదని చెప్పాడు. ఇక రెండో గుడ్డుని అభిజిత్‌పై కొట్టాడు. నాకు అబద్దాల కోరు అని ట్యాగ్ ఇచ్చారని నేను ఫీల్ అవుతున్నప్పుడు.. నువ్ వచ్చి అన్నీ నీకు సెట్ అవుతాయని అన్నావ్.. అందుకే నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు. అది కామెడీగా అన్నప్పటికీ కాస్త బాధ కలిగిందని చెప్పాడు. అయితే నేను మంచి చెబితే నువ్వు వేరేలా రీసీవ్‌ చేసుకున్నావ్‌.. ఇకపై  నువ్వు నా మీద జోకులు వేయకు.. నేను నీమీద జోకులు వేయా అని అభిజిత్‌ చెప్పాడు. 

కామెడీ ఆపేస్తే బాగుంటుంది 
ఇక అభిజిత్.. అవినాష్‌ని నామినేట్ చేస్తూ.. నువ్ ఎప్పుడూ నేను ఎంటర్ టైన్మెంట్ చేస్తా, హెల్దీగా చేస్తా అని మీరు అనుకుంటారు తప్పితే.. నాకు అలా అనిపించదు. నువ్ కామెడీ చేయడానికి వచ్చి ఉండొచ్చు.. కానీ మేం కామెడీ తీసుకోవడానికి రెడీగా లేము.. కామెడీ ఆపేస్తే బాగుంటుందని అవినాష్‌కి చెప్పాడు. అయితే నేను ఇక్కడకి వినోదం చేయడానికి వచ్చా.. నేను కమెడియన్‌గా ఎంటర్‌టైన్ చేయడానికే వచ్చా.. చేస్తా నువ్ వద్దు అనుకుంటే రాకూడదు.. ప్రాణం పోయే వరకూ పెర్ఫామెన్స్ చేస్తా.. నువ్వేం చేయకుండా కూర్చుంటావ్.. నన్ను కామెడీ చేయొద్దని చెప్పడానికి నువ్ ఎవడివి? అంటూ అభిపై అవినాష్‌ ఫైర్‌ అయ్యాడు. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్‌ ముగిసింది. ఇక రేపటి ఎపిసోడ్‌లో కూడా కోడి గుడ్ల మోత మోగనుంది. అమ్మ రాజశేఖర్‌ చిందులు, అనూహ్యంగా అఖిల్‌ని మోనాల్‌ని నామినేట్‌ చేశాడు. అసలు అఖిల్‌ ఏ రీజన్‌తో మోనాల్‌ని నామినేట్‌ చేశాడో రేపటి ఎపిసోడ్‌లో చూసేద్దాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement